DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వన్యప్రాణులను కాపాడండి - అడవులను రక్షించండి..

వన్యప్రాణులను  à°œà±€à°µà°¿à°‚చనీయండి.. అడవులను పరిరక్షించండి..

విశాఖపట్నం, సెప్టెంబర్ 28 , 2018 (DNS Online ): ప్రకృతి దేవోభవ...వన్యప్రాణి దేవోభవ అన్నది ప్రతి ఒక్కరి నినాదం

కావాలని డాక్టర్‌ సూరపనేని విజయకుమార్‌ అన్నారు. పర్యావరణ మార్గదర్శి వైశాఖి సంస్థ శుక్రవారం నగరం లోని పౌరగ్రంధాయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన

మాట్లాడుతూ ‘‘వన్యప్రాణులను జీవించనీయండి.. అడవులను పరిరక్షిండి..’’ అనే నినాదంతో పర్యావరణ మార్గదర్శి వైశాఖి వాలంటీర్లు విశాఖ నగరంలోని విద్యాసంస్థల్లో

సెప్టెంబర్‌ 28 నుండి అక్టోబర్‌ 8à°µ తేదీ వరకూ 3 టీమ్‌లుగా 50 వేల మంది విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే జంతువుల పరిరక్షణ మీద

తీసిన డాక్యుమెంటరీ చిత్రాలను ప్రదర్శిస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. భూగోళంపై సమస్త జీవరాశినీ కాపాడుకున్నప్పుడే జీవవైవిధ్యం వల్ల జీవసమాజానికి

పర్యావరణ సేమ సక్రమంగా అందుతాయని, కలుషితం లేని గాలీ, నీరూ, పౌష్టికమైన, సమృద్ధి అయిన ఆహారం జీవులకు లభిస్తాయనీ ఆయన అన్నారు. భూమి కోతకు గురికాకుండా, నదులో,

సముద్రాల్లో కలవకుండా వుంటుంది. వీటన్నింటినీ లెక్కకడితే జీవవైవిధ్యం వల్ల ప్రతి సంవత్సరం మూడు ట్రిలియన్ల డాలర్లకంటే ఎక్కువ లాభం ప్రపంచానికి చేకూరుతోంది.

అన్ని దేశా స్థూల జాతీయోత్పత్తికంటే ఇది చాలా ఎక్కువ. విశ్వంలో ఇంతవరకూ జరిగిన పరిశోధనల్లో ఒక్క భూగోళం మీద మాత్రమే జీవరాశి జీవిస్తోంది. ఇటువంటి

పరిస్థితుల్లో సమస్త జీవరాశినీ జీవించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించవసిన బాధ్యత మానవాళి మీదే ఉంది. జీవావరణ చక్రంలో ఏ జీవి అంతరించినా దాని ప్రభావం

మానవాళి మీదే పడుతుంది. పర్యావరణ మార్గదర్శి వైశాఖి సంస్థ పిల్లలకు జంతువు గురించి, పక్షుల గురించి, చెట్ల గురించి విద్యార్థులకూ, ఇతర ప్రజానీకానికీ అవగాహన

కలిగించేందుకు కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమం లో విశ్రాంత తెలుగు ఉపాధ్యాయురాలు  à°ªà°‚తుల లలిత, ధాన్‌ ఫౌండేషన్‌ రీజినల్‌ కోఆర్డినేటర్‌ రమాప్రభ లు

మాట్లాడుతూ ‘‘ఇండియన్‌ బోర్డ్‌ ఆఫ్‌ వైల్డ్‌ లైఫ్‌’’ వారు 1952 నుండి వన్యప్రాణు సంరక్షణార్థం అక్టోబర్‌ 2 నుండి 8 వరకు వన్యప్రాణి సప్తాహాన్ని నిర్వహిస్తున్నారని,

ప్రతి ఒక్కరూ సమస్త జీవరాశీ జీవించి వుండేందుకు కృషి చేయాలి. దీనిని దృష్టిలోనికి తీసుకుని విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు మా వంతుగా పర్యావరణ మార్గదర్శి

వైశాఖి సంస్థ చేస్తూన్న కార్యక్రమాలలో పాల్గొంటామని అన్నారు.
ప్రధానంగా జంతు ప్రదర్శనశాలలు సైతం ప్రతి ఒక్కరిలో వన్య ప్రాణు ఆవశ్యకత గురించి అవగాహన

కలిగించేందుకు ఉపయోగపడతాయి. జంతుప్రదర్శనశాలకు వెళ్ళడం వలన మనకి వన్యప్రాణు సంరక్షణ, పర్యావరణంపై ఒక అవగాహన ఏర్పడతాయి. రకరకాల జంతువు ఏ ప్రాంతాలో నివసిస్తాయో

ఏ ఆహారాన్ని స్వీకరిస్తాయో అనే విషయాలను తొసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ జంతు ప్రదర్శన శాను విరివిగా సందర్శించాలి. కుటుంబమంతా ప్రకృతితో మమేకమై వుండడానికి జంతు

ప్రదర్శనశాలలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ మార్గదర్శి వైశాఖి ప్రతినిధు జె. రాజేశ్వరి, పి.వి. శిరీష, జి. సుష్మ, ఐ. బా శిరీష, కె.మల్లిక, బి. దుర్గాదేవి, బి.

ప్రవీణ, వి. లావణ్య, షణ్ముఖ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #environment  #public library

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam