DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శబరిమల ఆలయం పై సర్వాధికారం అయ్యప్పదే : మహిళా భక్తులు 

కోర్టు తీర్పు à°•à°¿ వ్యతిరేకంగా పెరుగుతున్న నిరసనలు, ర్యాలీలు  

ధర్మశాస్తా నియమాలకే à°­à°‚à°—à°‚ కల్గించవద్దు  

విశాఖపట్నం, అక్టోబర్ 03, 2018 (DNS Online ): కోట్లాది మంది

భక్తులు పవిత్రమైన దీక్షామాల ధరించి అత్యంత నిష్టతో పూజించే అయ్యప్ప స్వామి నియమాల కే  à°­à°‚à°—à°‚ కల్గించే విధంగా కోర్టు తీర్పులు ఇస్తున్నారంటూ అయ్యప్ప భక్తులు,

ప్రధానంగా మహిళా భక్తులు మండిపడుతున్నారు.  à°¶à°¬à°°à°¿à°®à°² ఆలయంలోకి ఏ వయసు మహిళలు అయినా వెళ్ళవచ్చు అంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై సర్వత్రా నిరసనలు

వ్యక్తమవుతున్నాయి. పలు హిందూ ధార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, అయ్యప్ప భక్త మండళ్లు, తదితర సంఘాల ఆధ్వర్యవం లో వివిధ రాష్ట్రాల్లో నిరసనలు, భారీ ర్యాలీలు

చేపడుతున్నాయి. ప్రధానంగా కేరళ రాష్ట్రంలోని పట్టనంతిట్ట ప్రాంతంలో మహిళా భక్తులు సుమారు 4 వేల మందితో నగరం లో చేపట్టిన భారీ ర్యాలీ లో నగరవాసులు, భక్తులు పెద్ద

సంఖ్యలో పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా  à°®à°¹à°¿à°³à°²à± మాట్లాడుతూ హిందూ ధర్మానికి, ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న à°ˆ తీర్పును తక్షణం పున సమీక్షించాలని డిమాండ్ చేశారు.

కేరళలో పాటు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో à°ˆ నిరసనలు ఉధృతమవుతున్నాయి. 

మేము 50 ఏళ్ళు వరకు ఎదురు చూస్తాము. కానీ ఆచారం పాటిస్తాం అని చాటి చెప్పారు.

శబరిమలై దేవాలయం ఉన్న పవిత్రతను, వివాదం చేయొద్దు అంటూ మహిళలు రోడ్లపైకి వచ్చి స్వామియే శరణం అయ్యప్ప అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు.. అదే విధంగా

వందల ఏళ్ళ నాటి నుంచి వస్తున్నా సంప్రదాయాలను మార్చడానికి కోర్టుల ప్రవేశాన్ని వీళ్ళు తప్పు పట్టారు. హిందూ సంప్రదాయాల్లో కోర్టుల జోక్యం ఉండరాదన్నారు. దీన్ని

వ్యతిరేకిస్తూ రిట్ పిటిషన్ వెయ్యాలని కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణం సుప్రీం కోర్టు ఈ తీర్పు ను పున సమీక్షించుకుని కోట్లాది మంది హిందువుల

మనోభావాలు కాపాడాలన్నారు. హైందవేతరులు వేసిన పిటిషన్ పై తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం వాళ్ళ హిందూ వ్యతిరేక శక్తులు పెట్రేగి

పోతున్నాయన్నారు. 

మహిళలకు నిబంధన :

ఆలయ నిబంధనలు, అయ్యప్ప సంప్రదాయ విధానాలకు లోబడి 12 ఏళ్ళ లోపు, 50 ఏళ్ళ దాటిన మహిళలను మాత్రమే ఈ ఆలయం లోకి అనుమతించడం

జరుగుతుంది. దీనికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. పైన తెలిపిన మధ్య వయసు  à°®à°¹à°¿à°³à°²à°•à± శారీరక ఇబ్బందులు ఉంటాయని, పైగా అయ్యప్ప à°’à°• బ్రహ్మచారి కావడం తో వీరిని

అనుమతించడం కుదరదని ఆలయం నిబంధనలు తెలియచేస్తున్నాయి. ఇది పూర్తిగా హిందూ ధర్మ సంప్రదాయం, ఆగమ శాస్త్ర పరంగా నిర్వహించబడే ఆలయమని, ఈ నిబంధనల్లో ఇతరుల జోక్యం

అనవసరమని మండిపడుతున్నాయి. 

కోర్టు తీర్పులతో పెట్రేగుతున్న హిందూ వ్యతిరేక శక్తులు :

వయసు తో నిబంధన లేకుండా మహిళలు కూడా ప్రవేశించవచ్చు అంటూ

కోర్టు ఇచ్చిన తీర్పు ను హిందూ వ్యతిరేక శక్తులు చాలా హేళన చేస్తూ వివిధ వెకిలి చేష్టలు చేస్తున్నాయి. 

ఉదాహరణకు శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం అంటూ

కోర్టు ఇచ్చిన తీర్పు ను ప్రక్కదారి పట్టిస్తూ,  à°’à°• యువతి అయ్యప్ప మాల ధరించి, నుదుటున విభూతి ధరించి, నల్లని వస్త్రాలు వేసుకుని, పంచె ను 90 శాతం పైకి ఎత్తి పెట్టి

కూర్చుని జనాన్ని రెచ్చగొట్టే విధంగా ఫోటోలు తీసి సోషల్ మీడియా పెట్టి మరీ వెటకారం చేసింది. దీనికి స్పందనగా కొందరు వ్యక్తులు కొన్ని విభిన్న సందేశాలు కూడా

కామెంట్ల రూపం లో పెట్టడం తో అయ్యప్ప భక్తులను భయబ్రాంతులని చేస్తోంది. ఇది కోర్టు తీర్పు వచ్చిన కేవలం రెండు రోజుల్లోనే చోటు చేసుకున్న ఘటన, ఇక రానున్న కాలం లో

ఇంకెన్ని బూతు సినిమాలు చూపిస్తారో తెలియకుండా పోయింది. వాస్తవానికి ఇలా హిందూ ధర్మాన్ని వెటకారం చేసే వారెవరికీ హిందూ ధర్మం పట్ల గౌరవం గానీ, భారత దేశం పట్ల

భక్తి గానే ఉండవు, వీరు కేవలం సమాజాన్ని బ్రష్టు పట్టించడానికే ఇలాంటి వెకిలి చేష్టలు చేస్తుంటారు. పైగా ఇలాంటి వాటిని  à°ªà±à°°à°§à°¾à°¨ కారణం à°—à°¾ సుప్రీం కోర్టు ఇచ్చిన

తీర్పు నే సాకుగా చూపిస్తున్నారు. 

తప్పుదారి పట్టించే వారిపై చర్యలు చేపట్టాలి :

గతం లో కోర్టులు అంటే ప్రతీ భారతీయునికి ఎంతో గౌరవం ఉండేది. అయితే

కొన్ని విభిన్న భావాలు కల్గిన కొందరు వ్యక్తులు జడ్జీలుగా రావడంతో తీర్పులు సైతం విభిన్నంగానే ఉంటున్నాయి.  à°µà°¾à°³à±à°³à± కొన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని

తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. వారి ఆలోచనలు, అప్పటి పరిస్థితులు, సాక్ష్యాధారాల ఆధారంగా వారు ఇచ్చే తీర్పులు ఉంటాయి. వీరి ఉద్దేశం చట్టపరంగా సరైనదే కావచ్చు, అయితే

దీన్ని వీటిని వేరే కోణం లో చూసే హిందూ వ్యతిరేక శక్తులు వీటిని పూర్తిగా తప్పుదారి పట్టించేస్తున్నాయి. ఇలాంటి శక్తులకు అవకాశం ఇవ్వకుండా కఠిన చర్యలు

తీసుకున్నట్టయితే అందరూ ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.

 

 

#dns  #dnslive  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #ayyappa mala  #kerala  #women protest  #supreme court verdict

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam