DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధర్మకర్తల కక్ష పూరిత దౌర్జన్య ఘాతుకానికి అర్చకుడు మృతి.

అర్భకులైన అర్చకుల పై కక్ష కడతారా ? 

అర్చకుని ఆవేదన పట్టించుకున్న నాధుడే లేదు. 

రాజమహేంద్రవరం, అక్టోబర్ 03, 2018 (DNS Online ): హిందూ సమాజం సిగ్గు పడి తలదించుకునే

పరిస్థితి రాజమహేంద్ర వరంలోని ఓ శివాలయం లో జరిగింది. ధర్మకర్తల పేరుతో ఆలయ అర్చకునిపై మానసికం, భౌతిక దాడులు గురిచేయడంతో పాటు, అయన నివాసం ఉండే ఇంటికి తాళాలు

వేసి బయటకు నెట్టడంతో పాటు, ఆలయం నుంచి బయటకు వెళ్లగొట్టె ప్రయత్నం చెయ్యడం తనకు రక్షణ కల్పించండంటూ ఆలయ అర్చకుడు ఎందరికో మోర పెట్టుకున్న బుట్ట దాఖలాలే

అయ్యాయి. తన ఆవేదన వినే నాధుడు లేకపోవడం తో గత్యంతరం లేని పరిస్థితుల్లో అర్చకుడు ఆత్మహత్య ప్రయత్నం చేశారు, అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం

శివైక్యం చెందారు. అయన ఆవేదన ఒక సెల్ఫీ ద్వారా ప్రజలకు తెలియచేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి దుస్థితి మరే అర్చకునికి రాకూడదు అని తెలిపారు. ఆయన

మాటల్లోనే... 

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డివిజన్ కోరుకొండ మండలం కణుపూరు స్వయంభూ శివాలయంలో మల్లికార్జున శర్మ (మల్లిబాబు) సుమారు మూడు దశాబ్దాలు

పైగా అర్చకులుగా ఉన్నారు. వంశపారపర్యంగా ఆలయంలో సేవలు అందిస్తున్నారు. మల్లిబాబు ప్రతిష్టాత్మకంగా భావించి ఆలయ అభివృద్దికి శక్తి వంచన లేకుండా కృషి

చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఉభయగోదావరి జిల్లాల నుంచి కూడా భక్తులు ఆశించన దానికంటే ఎక్కువగానే వస్తున్నారు. ఆదాయం పెరుగుతున్నందున ధర్మకర్తలు గా ఉన్నవారు

మరో ఆలోచన చేశారు. ఇక్కడ నుంచి à°ˆ అర్చకుని పంపించి వేసి తమకు తెలిసిన మరో అర్చకుని ఆలయంలో à°•à°¿ తీసుకు రావాలని ప్రయత్నాలు ప్రారంభించారు.  à°ˆ నేపధ్యంలోనే

మల్లిబాబుకు ధర్మకర్తల నుంచి వేదింఫులు ప్రారంభం అయ్యాయని ఆరోపణలు వినవస్తున్నాయి. మల్లిబాబు పై అసత్యప్రచారాలు చేస్తూ.. నిందలు వేస్తూ  à°¬à°¯à°¿à°Ÿà°•à± పంపించడానికి

కుట్రలు చేస్తున్నారని తెలిసింది. ఎప్పటి నుంచో నివశిస్తున్న ఇంటినుంచి బయిటకు పంపి తాళం వేశారని విశ్వసనీయవర్గాల సమాచారు. ఇపుడు గుళ్ళో నుంచి కూడా

వెళ్ళగొట్టడానికి సదరు వ్యక్తులు వత్తిడి తీసుకు రావడంతో మంగళవారం ఉదయం మల్లి బాబు గడ్డి రాకుండా చల్లే మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. పరిసర

ప్రాంతాల వారు స్పందించి అతనిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం బుధవారం చికిత్స పొందుతూ ఆసుపత్రి లో తుది శ్వాస

విడిచారు. దీనిపై అర్చక సంఘాలు మండిపడుతున్నాయి. మల్లిబాబు మృతికి కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అర్చక కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్

చేస్తున్నారు. 

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #rajamahendravaram  #rajahmundry  #temple  #priest  #suicide  #temple trustee  #harrassment 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam