DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాదాయ శాఖా లంచం తీసుకోవాలంటే మీటింగ్ పెట్టాలి, లిస్ట్ రాయాలి. 

దేవాదాయ శాఖా లో అక్రమార్జనకు కూడా అర్జెంట్ సమావేశాలా ?

పోలమాంబ గుడి ఈఓ కొత్త ఒరవడి... ఆశ్చర్య పోయిన ఏసీబీ 

విశాఖపట్నం, అక్టోబర్ 4 , 2018 (DNS Online) : ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర దేవాదాయ శాఖా ను అధర్మాదాయ శాఖగా మార్చేసిన ఘనులకు ధీటుగా ప్రస్తుతం కొత్తకొరవడిని సృష్టించారు విశాఖలోని దేవాదాయ శాఖా అధికారులు. లంచం తీసుకోవాలంటే

అర్జెంట్ మీటింగులు పెట్టాలి, తీసుకోవాల్సిన వారి లిస్ట్ రాయాలి. ఇదే లేటెస్ట్ ట్రెండ్. ప్రభుత్వ ఉద్యోగులు అదనపు ఆదాయం ( లంచం) తీసుకోవడమే మహా నేరంగా నిబంధనలు

విధించారు. అయితే కొంత కాలం వరకూ బహిరంగంగా లంచం తీసుకోడానికి భయపడేవారు. ఎందరో అవినీతి తిమింగలాలను పట్టుకున్న అవినీతి నిరోధక శాఖా అధికారులనే ఆశ్చర్య

పోయేలా చేసింది గురువారం ఘటన. విశాఖ నగరం లోని పోలమాంబ గుడి ఈఓ పై అవినీతి ఆరోపణలపై దాడి చేసిన సందర్బంలో వారికీ తెలిసిన విషయం. సిబ్బంది పీఆర్సీ జీతాల నుంచి

లంచం తీసుకోడానికి సెప్టెంబర్ 27 న ఒక అర్జెంట్ సమావేశం పెట్టి ఎవరెవరు ఎంత ఇవ్వాలి అనేది ఒక లిస్ట్ రాసి మరీ హుకుం జారీ చేయడం జరిగింది. దీనికి ఆధారంగా ఈఓ డైరీ లో

రాసుకుని లిస్ట్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కింది. దీన్ని చూసి ఆశ్చర్యపోయారు. 

అక్షరాలు కూడా రానివాళ్ళా ఆఫీసు సిబ్బంది :

అవినీతి నిరోధక శాఖ

అధికారుల తనిఖీల్లో భాగంగా కారకచెట్టు పోలమాంబ గుడి లోని కార్యాలయ సిబ్బంది ఒకరిని "విష్వక్సేనుడు ", " చెకోస్లెవేకియా  " పదాలు వ్రాయమని à°…à°¡à°—à°¡à°‚ జరిగింది.

అక్షర దోషాలు కనపడడం తో, సీనియర్ అసిస్టెంట్ ను కూడా ఇదే పదాలు వ్రాయమని అడగడం జరిగింది. ఆ కాయితాలు తమ వెంట తీసుకుని వెళ్లారు. అక్షరాలూ కూడా సరిగ్గా రానివాళ్ళని

దేవాదాయ శాఖలో కార్యాలయ ఉద్యోగులుగా నియమించడం తో à°ˆ అధర్మాదాయ శాఖలో అవినీతి ఏ స్థాయిలో రాజ్యమేలుతోందో తెలుస్తోంది. 

 

 

#dns  #dnsnews  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #endowments  #karaka chettu polamamba

temple  #acb  #eo  #red handed  #archakas  #record assistant  #temple staff 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam