DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తంత్రీ నాదంతో మారు మ్రోగిన విశాఖ, వైభవంగా వీణా నాదార్చన

విశాఖపట్నం, అక్టోబర్ 12, 2018 (డిఎన్ఎస్ DNS Online): చిన్న పెద్ద భేదం లేకుండా వీణా నాదం తో విశాఖ నగరాన్ని మైమరపింపచేసింది వీణా నాదార్చన. విశాఖపట్నం లోని బివికె కళాశాల లో

కళాశాల సంగీత విభాగం ఆధ్వర్యవం లో  à°œà°°à°¿à°—à°¿à°¨ వీణా నాదార్చన లో శుక్రవారం ఉదయం నుంచి, సాయంత్రం వరకూ ఏకబిగిన జరిగిన సంగీత యజ్ఞం లో బాలల నుంచి, ఆకాశవాణి హైగ్రేడ్

కళాకారుల వరకూ ఎందరో విద్వాన్సులు, విదుషీమణులు పాల్గొని, సంగీత సరస్వతికి ఘన నివాళి అర్పించారు. గురువారం 9 ఉదయం గంటలకు ముడుంబై లక్ష్మి రంగసాయి, లక్ష్మి

సూర్యశ్రీ ల వీణా ద్వయం తో మొదలైన కార్యక్రమం రాత్రి 9 గంటల వరకూ సాగింది. వీణా నాద యజ్ఞం లో పాల్గొనేందుకు అన్ని స్థాయిల సంగీత సాధకులకు అవకాశం కల్పించాలి అనే

సంకల్పనతో పది నిమిషాల నిడివి,15 నిమిషాల నిడివి, 30 నిమిషాల నిడివి తో అవకాశం కల్పించారు. 
à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిధి à°—à°¾ పాల్గొన్న ప్రముఖ సాహితీ వేత్త  à°¡à°¾à°•à±à°Ÿà°°à±

పేరి రవి కుమార్ మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి సంగీత నీరాజనం అందించడం అత్యద్భుతమైన ఘట్టం అన్నారు. తంత్రీ నాదం తో మానవ శరీరం లోని అణువణువూ

స్పందిస్తుందని, వేదం లో కూడా తంత్రీ నాదానికి ప్రముఖ స్థానం కల్పించబడిందన్నారు. మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు వింటిని ఎంత వేగంగా ఉపయోగించగలరో, అంతే

అద్భుతంగా విపంచి ( వీణ) ను మ్రోగించగలరనే విషయం చాలామందికి తెలియదన్నారు. కళాశాల అధ్యాపకులు కృష్ణవేణి మాట్లాడుతూ గత రెండేళ్ల నుంచి నవరాత్రి ఉత్సవాల్లో వీణా

నాదార్చన తమ కళాశాలలో నిర్వహిస్తున్నామని, ఈ వేడుకల్లో నేర్చుకునే విద్యార్థుల నుంచి, మహామహులైన కళాకారుల వరకూ సైతం తమ సంగీత విద్యతో సరస్వతికి నివాళి

అర్పిస్తున్నారన్నారు. గురువారం జరిగిన కార్యక్రమం లో డాక్టర్ బి కె డి ప్రసాద్, మల్లాప్రగడ జోగులాంబ, డాక్టర్ టి పద్మిని, పప్పు పద్మ రవిశంకర్, వివి ఎస్ మీనా

కుమారి, బండి శ్యామల, కె. ఉదయలక్ష్మి, మండపాక శ్రీదేవి, ఆర్. మీరా తదితర ప్రముఖ వీణా విద్వాన్సులు, పలు సంగీత విద్య సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు

పాల్గొన్నారు. 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #veena  #nadarchana  #bvk college
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam