DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జపాన్ సహకారం తో జిల్లా టిటి పోటీలు ప్రారంభం 

స్వచ్చంద సంస్థలు క్రీడలకు ప్రోత్సాహాన్నివ్వాలి : కలెక్టర్ 

విశాఖపట్నం, అక్టోబర్ 13, 2018 (డిఎన్ఎస్ DNS Online) : దేశ విదేశాల్లోని స్వచ్చంద సంస్థలు అకాడమీలు క్రీడల

అభివృద్ధికి  à°ªà±à°°à±‹à°¤à±à°¸à°¾à°¹à°¾à°¨à±à°¨à°¿ సంపూర్ణంగా కొససాగించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం నగరం లోని స్వర్ణభారతి ఇండోర్

మైదానం లో జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్ ను అయన ప్రారంభించారు. విశాఖపట్నం జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం, రోటరీ క్లబ్ విశాఖ వేలి, జపాన్ కు చెందిన

ఎల్ ఏంజెల్ అంతర్జాతీయ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో సుమారు 200 మంది చిన్నారులు వివిధ విభాగాల్లో పోటీ పడనున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన ఇద్దరు

క్రీడాకారులకు తదుపరి మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు జపాన్ తీసుకెళ్లనున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈ విధమైన స్వచ్చంద సంస్థలు క్రీడల అభివృద్ధి కి సహకరించి, దేశీయ,

అంతర్జాతీయ వేదికలపై అత్యుత్తమ ప్రదర్శన చూపేందుకు కృషి చేయాలన్నారు. జపాన్ నుంచి విశాఖ వచ్చి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఎల్ ఏంజెల్

స్వచ్చంద సంస్థ ప్రతినిధులకు ధన్యవాదములు తెలియచేసారు. వీరిని విశాఖ తీసుకురావడంలో విస్తృత కృషి చేసిన విశాఖ జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి డి విఎస్ వై

శర్మను ప్రత్యేకంగా అభినందించారు. ఎంతో దూరం నుంచి వచ్చిన జపాన్ బృందం ఇచ్చే సూచనల ద్వారా క్రీడా ప్రతిభను మెరుగు పరుచుకోవాలని బాల బాలికలకు సూచించారు. అనంతరం

జపాన్ కు చెందిన à°Ÿà°¿à°Ÿà°¿ క్రీడాకారులతో à°’à°• గేమ్ ఆడి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమం లో జిల్లా à°Ÿà°¿à°Ÿà°¿ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns

media  #vizag  #visakhapatnam  #table tennis  #tt  #collector  #praveen kumar 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam