DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్నేహ శీల సేవలకు ప్రాధాన్యం - డిజిపి ఆర్ పి ఠాకూర్

పోలీసు అమర వీరుల వారోత్సవాలు ప్రారంభం

విశాఖపట్నం, అక్టోబర్ 16, 2018 ( DNS Online ) :  à°ªà±à°°à°œà°²à°•à±  à°¸à±à°¨à±‡à°¹à°¶à±€à°²à°¿ సేవలు అందించేందుకే రాష్ట్ర పోలీసు వ్యవస్థ నిరంతరం

శ్రమిస్తోందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసు డైరక్టర్ జనరల్ ( డిజిపి ) ఆర్పీ ఠాకూర్ తెలియచేసారు. పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా మంగళవారం విశాఖపట్నం

సిటీ, రూరల్ పోలీసు విభాగాల ఆధ్వర్యవం లో జరిగిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వివిధ పోరాటాల్లో అమరులైన పోలీసు సిబ్బందికి

నివాళిగా అక్టోబర్ 21 న పురస్కరించుకుని పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. ఈ సందర్బంగా ఆర్ పి ఠాకూర్ మాట్లాడుతూ

పోలీసులు ప్రజల సంక్షేమం కోసమే నిరంతరం శ్రమిస్తున్నారని, వారి పట్ల ప్రజల్లో సహృదయ భావం మరింత ఏర్పడవలసిన అవసరం ఉందన్నారు. ప్రజలకు మరింత చేరువ అయ్యే విధంగా

ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పాఠశాల విద్యార్థులకు పోలీసు విభాగం చేపట్టే కార్యక్రమాలపై అవగాహనా కల్పించేందుకు ఓపెన్ హౌస్ కార్యక్రమం కూడా

నిర్వహిస్తున్నామన్నారు. పగలనక, రాత్రనక విధి నిర్వహణలో ఉంటూ ప్రజలకు సంపూర్ణ రక్షణ కల్పించే బాధ్యతలో సత్కారాలు కంటే విసుర్లు, ఛీత్కారాలు ఎదురవుతున్నా,

బాధపడక, విధి నిర్వహణలో ఉంటూ, ప్రాణాలు సైతం కోల్పోతున్న వారందరికీ కృతజ్ఞత తెలియచేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ నెల 21 న పోలీసు అమర వీరుల

దినోత్సవం రోజు ఆయా అమరుల కుటుంబాల సభ్యులను కలిసి, వారికి అండగా పోలీసు శాఖ ఉంటుందనే ధైర్యం కల్గించడం భాద్యతగా భావిస్తున్నామన్నారు. వారోత్సల్లో భాగంగా

విశాఖ నగరం లో ఆదివారం సాగర తీరం లో భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం పోలీసు సిబ్బందికి వ్యాస రచన పోటీలు నిర్వహించారు. మంగళవారం పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం

చేపట్టారు. ఈ కార్యక్రమం లో నగర పోలీసు విశాఖ నగర పోలీసు కొత్వాల్ ( కమిషనర్) మహేష్ చంద్ర లడ్డా, ఇతర ఉన్నతాధికారులు నుంచి క్రింది స్థాయి సిబ్బంది, వారి కుటుంబ

సభ్యులు సుమారు 102 మంది స్వచ్చందంగా పాల్గొని, రక్తం దానం చేశారు. వీరందరినీ డిజిపి, సిపిలు  à°…భినందించారు. ప్రభుత్వ వైద్య శాల కెజిహెచ్ బ్లడ్ బ్యాంకు తో పటు,

ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకు, , ఏ ఎస్ రాజా బ్లడ్ బ్యాంకు, లైఫ్ సేవ్ బ్లడ్ బ్యాంకు, సిబ్బంది పాల్గొని, రక్తం నిల్వలను సేకరించారు. పోలీసు అమర వీరుల వారోత్సవాల్లో

భాగం గా పోలీసు ప్రాంతీయ ఆసుపత్రిలో మై క్యూర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నీలిమ ఆధ్వర్యవం లో పోలీసు సిబ్బంది కి, వారి కుటుంబ సభ్యులకు స్వచ్చందంగా ఉచిత వైద్య

శిబిరాన్ని నిర్వహించారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #police commemmoration day  3dgp  #rp takur  #city police

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam