DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉల్లాసంగా ఏపీడబ్ల్యూజేఎఫ్‌ ఆధ్వర్యవం లో దసరా సంబరాలు 

విశాఖపట్నం, అక్టోబర్ 17, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): జర్నలిస్టులు శక్తి స్వరూపులను, నిరంతర శ్రామికులని జిల్లా ప్రజాపరిషత్‌ ఛైర్‌పర్సన్‌ లాలం భవానీ అన్నారు. బుధవారం

వైశాఖి జల ఉద్యానవనంలో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ మహావిశాఖ నగరశాఖ నిర్వహించిన దసరా సంబరాల నుద్దేశించి ఆమె మాట్లాడారు. నిరంతరం మానసిక

ఒత్తిడికి లోనయ్యే జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఆటవిడుపుగా ఈ సంబరాలు నిర్వహించడం ముదావహమన్నారు. పదిరోజులు పాటు జరుపుకునే దసరా ఉత్సవాల్లో దుర్గామాత

ఒక్కో అవతారంలో ఒక్కో విధమైన శక్తిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టు పగలు, రాత్రి అనకుండా వృత్తికి అంకితమై అమితమై సమాజాభ్యున్నతికి శక్తివంతంగా

పనిచేస్తున్నారని వారి సేవలు  à°…నిర్వచనీయమైనవని అన్నారు. ప్రతీఏటా ఏపీడబ్ల్యూజేఎఫ్‌ దసరా సంబరాలు నిర్వహిస్తూ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కావల్సినంత

వినోదాన్ని, ఉత్సాహాన్ని పంచిపెట్టడం వలన వారు మరింతగా బలోపేతమై వృత్తికి న్యాయం చేస్తున్నారని శ్లాఘించారు. జీవీఎంసీ అదనపు కమిషనర్‌ జీవీఎస్‌ఎన్‌ మూర్తి

మాట్లాడుతూ ప్రతీఏటా దసరా సంబరాలు నిర్వహిస్తూ జర్నలిస్టుల్లో మానసిక ఉల్లాసం కల్గించడం గొప్పవిషయమన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు

విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. సెంచూరియన్‌ యూనివర్శిటీ వైస్‌ ప్రొఫెసర్‌ జి.ఎస్‌.ఎన్‌.రాజు మాట్లాడుతూ జర్నలిస్టు దసరా సంబరాల్లో పాల్గొనడం తనకు ఎంతో

సంతృప్తిని కల్గించిందని అన్నారు. జర్నలిస్టు వృత్తిపరంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి సాంస్కృతిక సౌరభాను

విరబూయించడాన్ని కొనియాడారు. సమాచార పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మణిరామ్‌ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో

ముందుంటున్నట్లు తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు హౌసింగ్‌ స్కీమ్‌ ప్రభుత్వం చేపట్టేలా తాము

ఎంతగానో పాటుపడ్డామని అన్నారు. త్వరలో డబుల్‌ బెడ్‌రూమ్‌, త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకోసం పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాలని కోరారు. జర్నలిస్టులు సంక్షేమం కోసం

నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ నగర అధ్యక్షులు పి.నారాయణ్‌ మాట్లాడుతూ నిరంతరం శ్రమకోడ్చి పనిచేస్తున్న జర్నలిస్టులు వారి కుటుంబ

సభ్యులకు వినోదాత్మక వాతావరణం అందించేందుకు ప్రతీఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా దసరా సంబరాలను ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించామని తెలియజేశారు. ఈ సంబరాల్లో

ప్రముఖ రాజకీయ నాయకుడు సుందరపు విజయకుమార్‌, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, నగరశాఖ అధ్యక్షు పి.నారాయణ్‌, కార్యదర్శి à°Žà°‚.అనూరాధ,

ఆర్గనైజింగ్‌ సెక్రటరీ à°¡à°¿.రవికుమార్‌, రూరల్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శు వెంకటేశ్‌, ఈశ్వరరావు, ఏపీబ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్టు అసోసియేషన్‌ నగర అధ్యక్షు

ఇరోతి ఈశ్వరరావు తదితయి పాల్గొన్నారు. 
మధురవాడకు చెందిన నిర్మ డ్యాన్స్‌ అకాడమి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఏపీడబ్ల్యూజేఎఫ్‌

రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఆనంద్‌, ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన à°ˆ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అరించాయి. à°ˆ వేడుకల్లో విశాఖ సమాచారమ్‌ దినపత్రిక

సంపాదకులు సూరంపూడి వీరభద్రరావు, ఉప సంపాదకులు అసోసియేషన్‌ అధ్యక్షులు జి.జనార్థనరావు, వైశాఖి జల ఉద్యానవనం డైరెక్టర్‌ చింతపూడి చిట్టిబాబు, డివిజనల్‌

పీఆర్వో సుమిత్రా దేవి, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ నాయకులు తదితరు లు పాల్గొన్నారు.

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #APWJF  #journalists  #dasara fest

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam