DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాబు అవినీతి పై అడ్డుకట్టకు ఇది ఆరంభం మాత్రమే : రామ్ మాధవ్.

గోబెల్స్ కు బాస్ చంద్రబాబే : తెదేపా పై చెలరేగిన  à°°à°¾à°®à± మాధవ్.

పార్టీలు ప్రజలకు జవాబు చెప్పాల్సిందే: రామ్ మాధవ్.

అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం

చెల్లించేది బీజపా నే :

ఇది తెలుగు దోపిడీ పార్టీ, హిట్లర్ పాలన విచ్చలవిడి అవినీతి చేస్తోంది. 

విజయవాడ, అక్టోబర్ 22 , 2018 (డి ఎన్ ఎస్) : ఆంధ్ర ప్రదేశ్ లో

తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అవినీతికు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ జనతా పార్టీ చేపట్టింది కేవలం ఆరంభం మాత్రమే అని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన

కార్యదర్శి రామ్ మాధవ్ ఉద్భోదించారు. అగ్రిగోల్డ్ బాధితుల  à°ªà±‹à°°à°¾à°Ÿà°¾à°¨à°¿à°•à°¿ మద్దతుగా సోమవారం విజయవాడ లో బీజేపీ ఆధ్వర్యవం లో నిర్వహించిన నిరాహార దీక్షలో అయన

పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం లో ప్రతీ రాజకీయ పార్టీ ప్రజలకు జవాబుదారీయేనని, వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకూ పార్టీలు జవాబు

చెప్పాల్సిందేనన్నారు. 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మంత్రులు, పార్టీ నేతలు గోబెల్స్, వాళ్ళ బాస్ చంద్రబాబు అని, ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం లో ఉన్న ఈ ఆంధ్ర ప్రదేశ్

లో పాలనా చేస్తున్నది తెలుగు దోపిడీ పార్టీ అని ప్రస్తుతం హిట్లర్ ప్రభుత్వం నడుస్తోందని, మంత్రులు గోబెల్స్ గా తయారైతే వాళ్లందరికీ నాయకుడు ముఖ్యమంత్రి

చంద్రబాబేనన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ ద్వారా మోసగించబడిన లక్షలాది మంది  à°ªà±à°°à°œà°²à°•à± అగిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటినుంచి చెల్లింపులు చెయ్యవలసిన

భాద్యత కల్గిన ముఖ్యమంత్రి, దీనికి భిన్నంగా వేల కోట్ల విలువైన ఈ ఆస్తులను తన పార్టీ వారికి, అనుయాయులకు అత్యంత తక్కువ ధరకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న

చంద్రబాబు ను ప్రశ్నించనందుకే బీజేపీ పై తెలుగుదేశం పార్టీ రాళ్లు విసురుతున్నారన్నారు. ఈ నిరసనలు కేవలం విజయవాడకే పరిమితం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని

ప్రాంతాల్లోనూ కొనసాగుతోందన్నారు. 

రాష్త్ర రెవెన్యూ లక్షన్నర కోట్ల రూపాయలు, అగ్రిగోల్డ్ బాధితులు నష్టపోయిన మొత్తం కేవలం ఆరున్నర 
ఎస్సేల్ వరల్డ్

సంస్థ ఈ బాధితులకు న్యాయం చేసేందుకు మాత్రమే అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేసి తక్షణం చెల్లింపులు చేసేందుకు ముందుకు రాగా, చంద్రబాబు ప్రభుత్వం ఆ సంస్థను

బెదిరించి, భయపెట్టి వెనక్కి పంపేసారన్నారు. 

అవినీతి ని అరికట్టాలి అంటే తాలూకా ఆఫీసు లో గుమాస్తానే కాదు పట్టుకోవడం, రాజ్యసభలో ఉన్న సీఎం రమేష్ లాంటి బడా

బాబులను కూడా పట్టుకోవడమే. అదే పని ప్రస్తుతం బీజేపీ చేస్తోందన్నారు. 

నిలువ నీడ లేకుండా పోయే వాడు మోడీ ని ఆపేస్తా అంటూ ఉత్తర కుమార ప్రగల్బాలు

చేస్తున్నారు. 

లక్షల కుటుంబాలకు న్యాయం చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రానున్న కాలంలో జరిగే 
అధికారం లో ఏర్పడే ప్రభుత్వం లో బీజేపీ

పార్టీ కీలక పాత్ర పోషించ నుందని, అధికారం లోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం చెల్లించబోతున్నదని తెలిపారు. 

ఇది తెలుగు ద్రోహుల

పార్టీ .. . .  à°µà°‚à°šà°¨ పార్టీ.:
ప్రస్తుతం అధికారం లో ఉన్నది తెలుగుదేశం పార్టీ కాదని, తెలుగు ద్రోహుల పార్టీ అని, అయితే ఈ పార్టీ ని స్తాపించిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు

పొడిచిన ప్రతినిధులకు ప్రజలను మోసం చెయ్యడం పెద్ద విషయం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించినదే తెలుగుదేశం పార్టీ, అలాంటి

పార్టీని అదే కాంగ్రెస్ కాళ్లక్రింద పెట్టిన ఘనుడు చంద్రబాబు, పార్టీనే తాకట్టు పెట్టిన వాడికి ప్రజలను ముంచడం పెద్ద లెక్క కాదన్నారు. 

అవినీతి ని పై నుంచి

అడ్డుకట్ట వెయ్యాలి. 
ఏ చిన్న పని కావాలన్నా చేతులు తడప కుండా పని జరగదని, అవినీతి విచ్చలవిడిగా మారిపోయిందన్నారు. గత నాలుగున్నరేళ్ల గా చేస్తున్న వీళ్ళ

దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం నుంచి  à°¬à±€à°œà±‡à°ªà±€ వైదొలగవలసి వచ్చిందన్నారు. 

కక్ష సాధింపు బీజేపీ లక్ష్యం కాదు.  :

పార్టీలపై, వ్యక్తులపై కక్ష

సాధింపు చెయ్యడం భారతీయ జనతా పార్టీ లక్ష్యం కాదని, నిజంగా బీజేపీ కక్ష సాధించాలంటే సీఎం రమేష్ లాంటి వాళ్ళు చాలా చిన్నవాళ్ళని, ఈ రాష్ట్రం లో లక్షల కోట్లు దోచిన

వాళ్ళు చాలా మందే ఉన్నారని మండిపడ్డారు. సీఎం రమేష్ బీజేపీ దృష్టిలో చాలా చిన్నవాడిని, వ్యాపారాలు చేసేవాడు పన్నులు సరిగ్గా కట్టాలి అని తెలియక పొతే ప్రభుత్వం

తెలియచేస్తుందన్నారు. 

ఆర్ధిక నేరస్తులు వెళ్ళేది తీహార్ కె :

ఈ దేశం లో కాంగ్రెస్ హయాంలో కోట్లాది రూపాయలు దోచుకున్న విజయ్ మాల్యాను, నీరవ్ మోడీలతో

సహా, ఆర్ధికంగా ఈ దేశానికి ద్రోహం చేసిన ప్రతి ఒక్కరినీ తీహార్ కు పంపిస్తామని, ఇప్పడికే ఈ ఆర్ధిక ద్రోహులను భారత్ లో నిలువ నీడ లేకుండా చేశామని, దేశం నుంచి బయటకు

పోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి జైల్లో వేస్తామని, ఇక్కడే వున్నవాళ్లు ఇప్పడికే జైల్లో కూర్చున్నారన్నారు. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వంతు

వస్తుందన్నారు. 

ఈ నిరసనల్లో బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ శాఖా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యులు జివిఎల్ నర్శింహారావు, నర్సాపురం ఎంపీ గోకరాజు

గంగరాజు, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి, ఇతర పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ

రాష్ట్రాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులు తమ ఇబ్బందులను, తాము పడుతున్న ఆర్థిక కష్టాలను సభాముఖంగా వివరించారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #vijayawada  #bjp  #ram madhav  #agri gold 

#thota vijayalakshmi  #kanna lakshminarayana

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam