DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిత్లీ తుఫాను బాధితుల సాయం లోనూ పార్టీల పక్షపాతమా ? : పవన్ కళ్యాణ్

టిడిపి, బీజేపీ. వైకాపా లపై జన సేనాని మండిపాటు. 
విశాఖపట్నం, అక్టోబర్ 22 , 2018 (డిఎన్ఎస్): శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తుపాన్ ఏ విధంగా, ఏ స్థాయిలో నష్టపరిచింది

వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 
తుఫాను ప్రాంతాలలో పర్యటించి, విశాఖ వచ్చిన

తదుపరి సోమవారం అయన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ 
సిక్కోలువాసులు ఈ తుపాను ప్రభావంతో ఎన్ని కష్టాలు పడుతున్నారో బయటి ప్రపంచానికి తెలియడం లేదని చెప్పారు.

తిత్లీ తీరాన్ని తాకింది, పెద్ద నష్టం కలగలేదు, అంతా చేసేశారు అంటూ తెలుగుదేశం పార్టీ, వాటి అనుకూల మీడియా  à°µà°°à±à°—ాలు చేసిన ప్రచారం వల్ల అసలు నిజం తెలియలేదు

అన్నారు. అంతా సవ్యంగా ఉంటె ఇంకా శ్రీకాకుళం జిల్లాలో బాధితులు ఎలా ఉన్నారో వాళ్ళకే తెలియాలన్నారు. శ్రీకాకుళం ప్రాంతం కష్టాలపై స్పందించడంలో కేంద్రం వివక్ష

చూపిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపొద్దన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం విశాఖపట్నంలో విలేకర్లతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో గమనించిన విషయాలను,

ప్రజల ఆవేదనని, జనసేన పక్షాన చేపట్టే సహాయ కార్యక్రమాలనీవివరించారు. ఉద్దానం ప్రాంత పరిస్థితులను వీడియో ప్రజంటేషన్ ద్వారా చూపించారు.
ఉద్దానం మూడు పంటలు పండే

పచ్చని ప్రాంతం. అక్కడే కిడ్నీ వ్యాధులు ఎక్కువ. వలసలూ ఎక్కువ. à°ˆ ప్రాంతంపై తిత్లీ తుపాన్ విరుచుకుపడి తీవ్ర నష్టాన్ని కలిగించింది. 
ప్రధాన డిమాండ్లు ఇవే : 
90

శాతం కొబ్బరి చెట్లు నేలకొరిగాయని, నిలబడ్డవాటిలో చాలా వరకూ మొవ్వు విరిగిపోయాయి. జీడీ మామిడికి తీవ్ర నష్టం కలిగింది. పశుసంపదను కోల్పోయారు. వరి, ఉద్యాన పంటలు

దెబ్బ తిన్నాయి. à°ˆ ప్రాంత రైతులకి సంపూర్ణ రుణ మాఫీ చేయాలి. పదేళ్ళపాటు ఆర్ధిక భరోసా కల్పించాలని,  à°ªà°‚à°Ÿ నష్ట పరిహారంగా హెక్టార్ వరికి రూ.40 వేలు, జీడీ మామిడి, మామిడి,

అరటి తోటలకి రూ. 50 వేలు, కొబ్బరి చెట్టుకి రూ.మూడు వేలు, పాడి పశువు ఒక్కోదానికి రూ.40 వేలు ఇచ్చి ఆదుకోవాలి. కిరాణా షాపులు లాంటివి పెట్టుకున్న చిరు వ్యాపారులకు రూ.20

వేలు, వృత్తి ఆధారిత వ్యక్తులకు రూ.10 వేలు, గీత కార్మికులకు రూ.30 వేలు ఆర్ధిక సాయం చేయాలి. నష్టాన్ని ఫోటో తీసి పంపించమంటున్నారు.. అసలు కరెంట్ ఉండదు, ఫోన్ బ్యాటరీకి

ఛార్జింగ్ ఉండదు. ఇక ఎలా ఫోటో తీసిపెడతారు? చనిపోయిన పశు కళేబరాలను ఫోటో కోసం ఉంచుకొంటే దుర్వాసన, రోగాల భయం. పూడ్చిపెడితే కుదరదట. ఇలాంటి సమయంలో మానవతా దృష్టితో

చూడాలని కోరారు. పెద్ద మనసు చేసుకుని బాధితులను ఆదుకోవాలన్నారు. 
* మత్స్యకారులకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలి
తుపాన్ సమయాల్లో నష్టపోతున్న మత్స్యకారుల్ని

ప్రత్యేక ప్యాకేజి ద్వారా ఆదుకోవాలి. వారి వలలు ధ్వంసం అయ్యాయి. బోట్లు దెబ్బతిన్నాయి. సముద్రంలోకి వెళ్లి వేటపై జీవించే వీరికి సాయం విషయంలో ప్రత్యేక దృష్టి

ఉండాలి. తీర ప్రాంతంలో తుపాన్ షెల్టర్లు పాడైపోయి ఉన్నాయి. తుపాను ముందు అప్రమత్తత  à°µà°¿à°·à°¯à°‚లో ప్రభుత్వం విఫలమైంది. హుద్ హుద్ సమయంలో ముందుగానే సన్నద్ధం చేయడంతో

ప్రజలు జాగ్రత్త పడ్డారు. అదే రీతిలో తిత్లీ తుపాన్ సమయంలో కూడా చేస్తే కనీసం ఆహారం, నీళ్లు లాంటివి తీసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకొనేవారు. ఈ ఆరు రోజుల్లో 48

గ్రామాలు సందర్శించి అక్కడి నష్టాన్ని పరిశీలించాను. రోడ్డు పక్క ఊళ్ళకి విద్యుత్ పునరుద్ధరణ చేశారుగానీ లోపల ఉన్న ఊళ్ళవైపు చూడలేదు. కనీసం ప్రజా ప్రతినిధులు,

మంత్రులు వెళ్ళలేదు. 
ముఖ్యమంత్రి గారు తుపాన్ విషయంలో వాస్తవాలు చెప్పాలి. ఆయన నిజం చెప్పి, ఇదీ పరిస్థితి అంటే స్పందించేవారు. ఆయన మాత్రం రబ్బరు బోట్లలో

తిరిగి ఫోటోలు తీయించుకోని అదో  à°ªà±à°°à°šà°¾à°° కార్యక్రమంలా చేశారు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు ఉంది. ఇదేమీ à°“ పార్టీ పని కాదు. à°“ ప్రాంతానికి జరిగిన నష్టం. అందరం

రాజకీయాలకి అతీతంగా స్పందించి ఆదుకోవాలి. కానీ సీఎం గారు అంతా చేసేశాం అంటూ ప్రచారం చేశారు. గవర్నర్ గారు కూడా అలాగే చెప్పారు. కేంద్రానికి ప్రతినిధి ఆయన.

ఆయనకీ అవగాహన కలిగించలేదు. మేము క్షేత్ర స్థాయి నష్టాలు, తుపానుకు ముందు ఈ ప్రాంతం ఎలా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా అయిపోయిందో తెలిపే నివేదికను సిద్ధం చేసి

ప్రధానమంత్రికి అందచేస్తాం. ఆ వివరాలను గవర్నర్ గారికి ఇస్తాం. ఉద్దానం ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో చూడాలి. కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతం. కాబట్టి

కేంద్రం తగిన విధంగా స్పందించాలి. కేంద్ర బృందాన్ని 15 రోజుల్లోగా పంపిస్తే ఇక్కడి వాస్తవ నష్టం తెలుస్తుంది. 

* వీధికో రకంగా సాయం :
ప్రజలు ఇంకా కష్టాల్లో

ఉంటే విజయోత్సవ ర్యాలీలు చేసి సత్కారాలు చేయడం ఏమిటి? ముఖ్యమంత్రి గారు కూడా అధికారులతో రివ్యూలుపెట్టి వారిని చంపేయకుండా బయటకు పంపించి పని చేయనీయండి. జన్మ

భూమి కమిటీల తీరు దారుణంగా ఉంది. తెలుగు దేశంవాళ్ళు కాకపోతే సాయం చేయడం లేదు. ప్రభుత్వ విధానంపై ప్రజల్లో, యువతలో చాలా ఆవేశం, ఆవేదన ఉన్నాయి. సిక్కోలు అంటే ఎందుకు

ఇంత చిన్న చూపు అనే బాధ ఉంది. మా భాషనీ, యాసనీ వెక్కిరిస్తారు... ఇప్పుడు సాయం విషయంలోనూ పట్టించుకోవడం లేదు అనే ఆవేదన వారిలో ఉంది. చదువుకున్న ఉపాధి ఇవ్వరు అనే బాధ

ఉంది. సాయం  à°šà±‡à°¯à°²à±‡à°¦à°¨à°¿ నిలదీస్తే బెదిరింపులకు దిగుతున్నారు. వీటిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు

గార్లు మంత్రులుగా ఉన్నా పట్టించుకోలేదు. విద్యుత్ పునరుద్ధరణే సక్రమంగా చేయలేదు. సహాయ కార్యక్రమాలు కూడా ఒక వీధికి చేస్తారు, మరో వీధికి ఉండదు. నేను ఒక చోటికి

వెళ్తే అయిదు వందల రూపాయలు ఇచ్చారు అన్నారు. మనిషికి ఒక్కక్కరికీ అనుకున్నా. ఊరు మొత్తానికి ఆ డబ్బులు ఇచ్చారని చెప్పారు. మంత్రులు ఇద్దరూ, ఎంపీ రామ్మోహన్ నాయుడు

గార్లు నాతో వస్తే పరిస్థితి చూపిస్తా. ప్రభుత్వం సక్రమంగా చేసినట్లు తేలితే నాది తప్పు అని ఒప్పుకుంటా. విపత్తు ఎంతటి నష్టాన్ని మిగిల్చింది వాస్తవ లెక్కలతో

చెపితే స్పందించే హృదయాలు ఎన్నో ఉన్నాయి. నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా... ఒక్కో ఊరిని దత్తత తీసుకొని సాయం చేయమని. ఇలాంటి విషయాల్లో రాజకీయ లబ్ది

పొందాలని చూడను. ఎక్కడైనా లోపాలు ఉంటే సరి చేసుకోమని చెబుతాను. అంతే తప్ప ప్రతిపక్ష నేత జగన్ లా ఇష్టం వచ్చినట్లు మాట్లాడను. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతం

విషయంలో ప్రత్యేకంగా స్పందించాలి. రెండు ప్రభుత్వాల మధ్య ప్రజలు ఇబ్బందిపడకూడదు" అన్నారు.
నాదెండ్ల మనోహర్  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ "తిత్లీ తుపాన్ తీవ్ర నష్టాన్ని

కలిగించింది. జనసేన తరఫున చేసే బాధిత ప్రాంతాలను ఆదుకొంటాం. పాఠశాలలు తెరిచారు కాబట్టి పిల్లలకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు ఇస్తాం. డయేరియా, మలేరియా వ్యాపించే

అవకాశం ఉంది. వాటికీ అవసరమైన మందులతోపాటు, ప్రజలకి అవసరమైన వైద్య సేవలను అందిస్తాం. చలి కాలం వచ్చేస్తోంది.. దుప్పట్లు పంపిణీ చేస్తాం. ఇవన్నీ ప్రస్తుత అవసరాలకి

తగ్గవి. ఆ ప్రాంతాల్లో దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని డీప్ బోర్ వెల్స్, ఆర్వో ప్లాంట్లు లాంటివి ఏర్పాటు చేస్తాం. మా పార్టీ తరఫున చేస్తున్న ఈ

సహాయకార్యక్రమాలకి ఏదీ నగదు రూపంలో తీసుకోమని, పవన్ కళ్యాణ్  à°‡à°šà±à°šà°¿à°¨ పిలుపునకు స్పందించి à°ˆ సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ పలువురు

ఎన్నారైలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు" అన్నారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #jana sena  #jsp  #pavan kalyan  #pawan kalyan  #titli

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam