DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ చర్యతో డిఫెన్స్ లో పడిన కాంగ్రెస్  

తిరుగుబాటు సభ్యులు 17 మందిపై అనర్హత వేటు

సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష, హ్యాపీ మూడ్ లో యడ్డీ. 

మ్యాజిక్ ఫిగర్ 104 , బీజేపీ సంఖ్య 105 ,  

(రిపోర్ట్ :

సాయిరాం CVS , Bureau). . .

బెంగళూరు,  à°œà±à°²à±ˆ  28, 2019 (డిఎన్‌ఎస్‌) : కర్ణాటక లో జరుగుతున్నా నాటకీయ పరిణామాలతో కన్నడ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అధికారంలోకి వచ్చింది

భారతీయ జనతా పార్టీ, స్పీకర్ కాంగ్రెస్ పార్టీ à°•à°¿ చెందిన వాడు  à°•à°¾à°µà°¡à°‚తో కాంగ్రెస్ సభ్యులు కొంత ఆనందం లో ఉన్నప్పటికీ, à°ˆ రోజు స్పీకర్ రమేష్ కుమార్ తీసుకున్న

నిర్ణయం తో పార్టీ మొతం డిఫెన్స్ లోకి పడిపోయింది. గత జె డి ఎస్ - కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వం తీరును విభేదించి తిరుగుబాటు చేసిన 14 మంది సభ్యులనూ రమేష్ కుమార్

నాలుగు సంవత్సరాలపాటు సస్పెండ్ చెయ్యడం తో కర్ణాటక అసెంబ్లీ మరింత ఆసక్తికరంగా మారింది. మరో ముగ్గురు సభ్యులను ఇంతకూ ముందే సస్పెండ్ చేసారు. దీంతో సభలో

సస్పెండ్ అయినా వారి సంఖ్యా 17 కు చేరింది.  à°¸à±à°ªà±€à°•à°°à±‌ తాజా నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.. దీంతో వారంత నాలుగేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి దూరం

కానున్నారు.

అయితే రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన బీజేపీ నేత యెడ్యూరప్ప సోమవారం సభలో బల పరీక్ష నిరూపించుకోనున్నారు. ప్రస్తుత

సంఖ్యా బలం 208 ప్రకారం ఎడ్డీ పదవి నిలబడాలంటే  à°•à°¾à°µà°²à°¸à°¿à°¨ సంఖ్యా 104 , కాగా బీజేపీ à°•à°¿ సభలో ఉన్న సభ్యుల సంఖ్యా  105 , దీనికి అదనంగా స్వతంత్ర అభ్యర్థి కూడా బీజేపీ à°•à°¿ మద్దతు

ప్రకటించనుండడంతో 106 తో ప్రభుత్వం గట్టెక్కే అవకాశం ఉంది.  à°°à°®à±‡à°·à± కుమార్ సభ్యులను సస్పెండ్ చెయ్యకుండా ఉన్నట్టయితే రేపటి సభ లో కొంత ఆసక్తికరమైన సన్నివేశాలు

ఎదురయ్యే అవకాశం ఉంది. 

రాజీనామా చేసేది లేదు : స్పీకర్  à°°à°®à±‡à°·à± 

కొత్త ప్రభుత్వం ఏర్పడినా తాను మాత్రం స్పీకర్‌ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని

స్పీకర్‌ రమేష్ కుమార్ తేల్చిచెప్పారు. సోమవారం సభలో బలనిరూపణ ఉంటుందని, à°Žà°‚ ఎల్ ఏ లు అందరూ తప్పక  à°¹à°¾à°œà°°à±à°•à°¾à°µà°¾à°²à°‚టూ స్పీకర్‌ రమేష్ కుమార్ ఆదేశాలు

జారీచేశారు. 

అనర్హత వేటుకు గురయిన ఎమ్మెల్యేలు వీరే..

కాంగ్రెస్‌ సభ్యులు : బస్వరాజు, మునిరత్నం, సోమశేఖర్‌, రోషన్‌బేగ్‌, ఆనంద్‌సింగ్‌, నాగరాజు, బీసీ

పాటిల్‌, ప్రతాప్‌ గౌడ్‌, సుధాకర్‌, శివరాం హెబ్బర్‌, మంత్‌ పాటిల్‌, రమేష్‌ జార్జ్‌హోళి, మహేష్‌. 

జేడీఎస్‌ : గోపాలయ్య, నారాయణ గౌడ్‌, విశ్వనాథ్‌
స్వతంత్ర

అభ్యర్థి : శంకర్‌  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 5, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam