DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అయ్యప్పల పై కేరళ ప్రభుత్వం మరింత ఆంక్షలు  

42 కిమీ  à°•à±‡à°°à°³ బస్సుల్లో రావాల్సిందే: శబరిమల దేవస్థానం ఆదేశాలు  

అయ్యప్పలపై కేరళ ప్రభుత్వానిది నిర్లక్ష్య వైఖరే.. .

ప్రయివేట్ వాహనాలకు నిలక్కల్ వరకే

అనుమతి. .

నిలక్కల్ నుంచి పంబ కు ఆర్టీసీ బస్సులే గతి 

(DNS రిపోర్ట్ : CVS సాయిరాం, బ్యూరో , విశాఖపట్నం): . .  . .

విశాఖపట్నం , అక్టోబర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌): అయ్యప్ప

దర్శనం కోసం శబరిమల ఆలయానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు కేరళ ప్రభుత్వం మరింత ఆంక్షలు పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. శబరిమల కు వచ్చే భక్తుల వాహనాలు కేవలం

నిలక్కల్ వరకే అనుమతి, ఆ పై నుంచి కేరళ రాష్ట్ర బస్సుల్లో టికెట్ కొనుక్కుని మరీ కచ్చితంగా ప్రయాణం చేయవలసిందే. నిలక్కల్ వాహన పార్కింగ్ నుంచి పంబ కు సుమారు 42

కిలోమీటర్ల దూరం (ఒక గంటకు పైగా ) ప్రయాణం చెయ్యాల్సియుంటుంది. పంబ దగ్గర రద్దీ అనే సాకు చూపుతూ అయ్యప్పలపై బస్సు టికెట్లను బలవనంగా రుద్దుతోంది. సుదీర్ఘ ప్రయాణం

బస్సుల్లో ప్రయాణం చెయ్యలేకే చాలామంది భక్తులు సొంత వాహనాలు, ప్రయివేట్ వాహనాలను ఏర్పాటు చేసుకుని పంబాకు చేరడం జరుగుతోంది. అయితే మొదటి నుంచి  à°…య్యప్ప భక్తులు,

అయ్యప్ప ఆలయం పట్ల కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉక్కుపాదమే మోపుతోంది. అయ్యప్ప ఆలయ సంప్రదాయాలను మంటగలుపుతూ నడి వయస్సు మహిళలను బలవంతంగా ఆలయ ప్రవేశం చేయించే

ప్రయత్నం చేసింది. కనీసం అయ్యప్ప భక్తుల మనోభావాలకు ఒక్క శతం కూడా విలువ ఇవ్వని వామపక్ష పార్టీ, అయ్యప్పలను కేవలం వ్యాపార వస్తువుగా మాత్రమే చూస్తోంది. దీనిపై

దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అభ్యంతరం తెలిపినా, నిరసనలు చేసిన కనీసం లెక్క కూడా చెయ్యలేదు. వీళ్ళ నుంచి కోట్లలో డబ్బులు మాత్రం వసూలు చేసేందుకు

మాత్రం సిద్దపడింది. 

 à°ªà±à°°à°¤à°¿ ఏటా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అయ్యప్ప భక్తుల నుంచి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్నా. . .వీళ్ళని కేవలం à°’à°• ఆదాయ మిషన్లుగానే

చూస్తోంది తప్ప, భక్తులుగా విలువ ఇచ్చి, ఆదరించిన దాఖలాలు లేవు. 

దేవస్వామి బోర్డు పలు సూచనలు చేసింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఎటువంటి

ఇబ్బంది తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేశామని, భక్తులు సహకరించాలని కోరింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రైవేట్

వాహనాల్లో వచ్చే అవకాశం ఉన్నందున, వీరికి తగిన ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. పంబ వద్ద రద్దీ అధికంగా ఉన్నందున, వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదని, అయితే ప్రభుత్వం

బస్సులను నడుపుతోందని తెలిపింది. శబరిమల అయ్యప్ప ఆలయ నిర్వహణ బోర్డు చేసిన సూచనలు ఇవే. . .

1. ప్రైవేట్ వాహనాలు, బస్సులు కేవలం  "నిలక్కల్" వరకు మాత్రమే అనుమతి

ఇవ్వడం జరిగింది.  

2. "నిలక్కళ్" నుండి "పంబ" వరకు . కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కె  à°†à°°à±à°Ÿà±€à°¸à±€ )  à°¬à°¸à±à°¸à±à°² ద్వారా మాత్రమే ప్రయాణించవలెను. à°† బస్ లో కండక్టర్

ఉండరు...కావున కూపన్ కొని బస్ లో ప్రయాణించవలెను. 

3. మీరు పంబ చేరిన తర్వాత త్రివేణి బ్రిడ్జి అయ్యప్ప వారధి (కొత్తగా నిర్మించిన) మీదుగా సర్వీస్ రోడ్డు ద్వారా

కన్నిమూల గణపతి ఆలయం చేరుకోవాలి. 

4. పంబ నుండి కాలినడక వంతెన మూసివేయబడింది (గమనించగలరు). 

5. త్రివేణి నుంచి "ఆరాట్టు కడావు" వరకు గల ప్రదేశాలు మట్టి బురద

తో నిండి ప్రమాడపూరిటంగా వున్నాయి కావున ఎవ్వరూ క్రిందికి దిగరాదు. 

6. పంబలో భక్తులకు కేటాయించిన ప్రదేశాలలో మాత్రమే స్నానం చేయాలి. మిగిలిన ప్రదేశాలలో

స్నానం చేయరాదు. 

7. సెక్యూరిటీ సిబ్బంది ఆదేశాలను తప్పనసరిగా పాటించాలి. పంబ పోలీసుస్టేషన్ ముందు ప్రదేశం పూర్తిగా దెబ్బతింది.కావున ఆ మార్గం గుండా కొండ పై

à°•à°¿ ఎక్కరాదు. 

8. పంబ పెట్రోల్ బంక్ నుండి "u" టర్నింగ్ పూర్తిగా దెబ్బతింది. కావున à°† ప్రాంతం పూర్తిగా మూసివేయబడింది. 

9. పంబ పరిసరాలు, అడవి దారిలో

ప్రమాదకరమైన "పాములు" బాగా సంచరిస్తున్నందువల్ల జాగ్రత్త à°—à°¾ వుండాలి. 

10. అనుమతి లేని దారుల ద్వారా కొండ ఎక్కరాధు. 

11. త్రాగు నీటిని వెంట

తీసుకెళ్లాలి. 

12.ప్లాస్టిక్ వస్తువులను వాడరాదు 

13. భోజనం, టిఫిన్స్ స్టాల్ నీలక్కల్ లో కలవు. 

14. ఇరుముడి లో ప్లాస్టిక్ కవర్లు,వస్తువులు

ఉండరాదు 

15. మీ కు అవసరమైన కొద్దిపాటి తినుబండారాల తెచ్చుకోవాలి 

16. మంచినీటి కొరత వల్ల నీటిని వృదాచేయరాధు ( నీటి పైపు లు పాడైన కారణంగా). 

17. ఇటీవల వరదల

కారణంగా నీలక్కళ్. పంబ. సన్నిధానం ప్రాంతాల్లో మరుగుదొడ్లు పాడైపోవటం వల్ల నియమిత మరుగుదొడ్ల ను వాడుకోవాలి. 

ఇవన్నీ తప్పని సరిగా అందరూ పాటించాలని

ఆదేశాలు జారీచేసింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 5, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam