DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ, గ్రామీణ రంగాలకు పెద్ద పీట 

జిల్లా కో వైద్య కళాశాల, జీఎస్టీ లో స్లాబ్ à°² సవరణ 

మహిళా సంక్షేమానికి భారీ బడ్జెట్ కేటాయింపులు 

సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మా

లక్ష్యం.

పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తెలుగింటి కోడలు నిర్మల 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . 

అమరావతి, ఫిబ్రవరి 01, 2020

(డిఎన్‌ఎస్‌) : కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి, గ్రామీణ రంగాలకు పెద్ద పీట వేస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నరేంద్ర

మోదీ నాయకత్వం లో భారతీయ జనతా పార్టీ రెండవసారి కేంద్రంలో అధికారం లోకి వచ్చిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిగా భాద్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండో సారి

బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా భారత దేశ అత్యున్నత చట్ట సభ సాక్షిగా భారత ఆర్ధిక వ్యవస్థ గణాంకాలు, ప్రణాళికలను ప్రకటించారు. ప్రధానంగా మూడు ప్రాధాన్యతలను

ప్రకటించారు. రైతుల దిగుబడి పెంచడమే లక్ష్యమన్నారు.  à°†à°°à±à°¥à°¿à°• మంత్రి.  à°¸à±à°µà°šà±à°›à°­à°¾à°°à°¤à±, జల్ జీవన్ మిషన్ లకు పెరిగిన కేటాయింపులు చేసినట్టు తెలిపారు.  à°ªà±à°°à°ªà°‚చంలోని ఐదో

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ లో రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలివి.
* వ్యవసాయ రంగానికి రూ. 2.83 లక్షల కోట్లు.
*

గ్రామీణాభివృద్ధికి రూ. 1.23 లక్షల కోట్లు.
* ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 15 లక్షల కోట్లు.
* స్వచ్చ భారత్ మిషన్ కోసం రూ. 12,300 కోట్లు.
* జల్ జీవన్ మిషన్ కు రూ.

3.06 లక్షల కోట్లు.
* ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి రూ. 6,400 కోట్లు.
* ఆరోగ్య రంగానికి రూ. 69 వేల కోట్ల కేటాయింపు.
* విద్యా రంగానికి రూ. 99,300 కోట్లు.
* నైపుణ్యాభివృద్ధి

కేంద్రాలకు రూ. 3 వేల కోట్లు.
* దేశాభివృద్ధి వేగంగా సాగాలంటే, కేంద్రంతో రాష్ట్రాలు కలిసిరావాలి.
* ఎన్డీయే ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలు.
*

దేశాభివృద్ధికి యువత అత్యంత కీలకం.
* కొత్తగా 16 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు చేరారు.
* ఇప్పటివరకూ 40 కోట్ల జీఎస్టీ రిటర్న్ ల దాఖలు.
* జీఎస్టీ ప్రవేశపెట్టిన

తరువాత పన్ను విధానంలో పారదర్శకత.
* జీఎస్టీ స్లాబ్ ల తగ్గింపుతో సామాన్యులకు ఎంతో మేలు.
* ప్రజల నెలవారీ ఖర్చులో 4 శాతం మిగిలింది.
* జీఎస్టీ సమస్యల పరిష్కారానికి

కృషి చేస్తున్న జీఎస్టీ మండలి.
* సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్... మా లక్ష్యం.
* ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా నిరుపేదలకు అందించేందుకు కృషి.
*

నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాం.
* 2006 నుంచి 2016 మధ్య పేదరికం నుంచి 22 కోట్ల మంది బయటపడ్డారు.
* 2019లో కేంద్రంపై 48.7 శాతం మేరకు తగ్గిన రుణభారం.
* 284

బిలియన్ డాలర్లకు పెరిగిన ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు.
* ప్రధాని ఆవాస్ యోజన ద్వారా దేశంలోని పేదలందరికీ సొంత ఇళ్లు.
* మొదటి ప్రాధాన్యాంశం వ్యవసాయం, సాగునీరు,

గ్రామీణాభివృద్ధి.
* రెండో ప్రాధాన్యతగా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు.
* మూడో ప్రాధాన్యాంశంగా విద్య, చిన్నారుల సంక్షేమం.
* 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు

చేయడమే లక్ష్యం.
* కౌలు రైతుల కోసం త్వరలోనే కొత్త చట్టం.
* ప్రధాని ఫసల్ బీమా ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు బీమా.
* పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి.
*

గ్రామీణ కృషి సంచాయ్ యోజన ద్వారా సూక్ష్మ, సాగునీటి విధానాలకు ప్రోత్సాహం.
* గ్రామీణ సడక్ యోజన, ఆర్థిక సమ్మిళిత విధానాలతో రైతులకు మేలు.
* పంటల దిగుబడిని మరింతగా

పెంచేందుకు కృషి.
* వ్యవసాయ విపణులు మరింత సరళీకృతం.
* వర్షాభావ నిధులకు అదనంగా నిధులు, సాగునీటి సౌకర్యం.
* రైతులకు 20 లక్షల సోలార్ పంపుసెట్లు, బీడు భూముల్లో

సోలార్ యూనిట్లకు పెట్టుబడి సాయం.
* రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి. సేంద్రీయ ఎరువుల వాడకంపై అవగాహన.
* భూసార పరిరక్షణకు అదనపు సాయం, సంస్కరణల అమలు.
* రైతులకు

సహాయంగా నాబార్డు నిధులతో మరిన్ని గిడ్డంగుల నిర్మాణం.
* పీపీపీ పద్ధతిలో ఎఫ్సీఐ ఆధ్వర్యంలో గోడౌన్లను నిర్మిస్తాం.
* పంటల కొనుగోలుకు నాబార్డు ద్వారా

ఎస్ఎస్జీలకు సహాయం.
* కూరగాయల సరఫరాకు కృషి ఉడాన్ యోజన.
* ప్రత్యేక విమానాల ద్వారా పండ్లు, కూరగాయలు, పూల ఎగుమతులు.
* ఉద్యాన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం.
*

కేంద్రంతో పాటు రాష్ట్రాల నుంచి కూడా ఉద్యాన పంటలకు అదనపు నిధులు.
* ఉద్యాన పంటల కోసం ప్రత్యేక క్లస్టర్లు.
* పాల ఉత్పత్తుల్లో విప్లవాత్మక మార్పులు

తెచ్చేందుకు కృషి.
* కరవు జిల్లాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు.
* ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే వారికి మరింత ప్రోత్సాహం.
* ఆయుష్మాన్ భారత్ లో

భాగంగా దేశవ్యాప్తంగా 20 వేల ఆసుపత్రుల నిర్మాణం.
* మత్స్యకారుల కోసం నూతనంగా 3,400 'సాగర్ మిత్ర'లు.
* ఆల్గే, సీవీ కేజ్ కల్చర్ విధానంలో మత్స్య పరిశ్రమకు

ప్రోత్సాహకాలు.
* కోస్తా ప్రాంతాల్లోని గ్రామీణ యువతకు మత్స్య పరిశ్రమలతో మరింత ఉపాధి.
* మిషన్ ఇంద్రధనుష్ ద్వారా టీకాలు.
* ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛభారత్

ద్వారా కొత్త స్కీమ్ లు.
* 'టీబీ హరేగా... దేశ్ బచేగా' పేరుతో క్షయ వ్యాధి నివారణా చర్యలు.
* బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా అవతరిస్తున్న భారతావని.
* 2030 నాటికి

అత్యధిక యువత భారత్ లోనే.
* స్థానిక సంస్థల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్రెంటీస్ విధానం.
* విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఇండియా పేరిట కొత్త

కార్యక్రమం.
* నూతనంగా నేషనల్ పోలీస్ వర్శిటీ, నేషనల్ ఫోరెన్సిక్ వర్శీల ఏర్పాటు.
* 2026 నాటికి 150 యూనివర్శిటీల్లో కొత్త కోర్సులు.
* జిల్లా ఆసుపత్రులతో మెడికల్

కాలేజీల అనుసంధానం.
* విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం.
* భూమి సౌకర్యం కల్పించే రాష్ట్రాలకు కేంద్రం నుంచి అదనపు ప్రయోజనాలు.
* వైద్య పీజీ కోర్సుల

కోసం పెద్దాసుపత్రులకు మరిన్ని ప్రోత్సాహకాలు.
* వర్శిటీల కోసం త్వరలో జాతీయ స్థాయి విధానం.
* ఉపాధ్యాయులు, పారా మెడికోల కొరత తీర్చేలా కొత్త విధానం.

 

click here button to get

the  Complete speech by FM  Ms Nirmala Seetharaman 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 5, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam