DNS Media | Latest News, Breaking News And Update In Telugu

త్వరలో రామ్ మహల్ గా మారనున్న తాజ్ మహల్ ?

*తాజ్ మహల్ కూల్చక ముందు ఉన్న గుడి తిరిగి కట్టేస్తాం* 

*ముస్లిం లు కూల్చిన గుళ్ళు నూ తిరిగి నిర్మింపచేస్తాం:*  

*యుపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు. . .* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 15, 2021  (డి ఎన్ ఎస్):* ఉత్తర ప్రదేశ్ లోని

హిందూ దేవాలయాలు కూల్చి ఎక్కెడెక్కడైతే మసీదులు కట్టారో వాటి స్థానంలో తిరిగి గతంలో ఉన్న హిందూ దేవాలయాలను నిర్మస్తామని ఉత్తర ప్రదేశ్ లోని బల్లియా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ప్రకటించారు. శనివారం ఆగ్రా లోని తాజ్ మహల్ ను పరిశీలించిన aayan చాలా ఆవేదన చెందారు. గతంల ఇది ఒక శివాలయం ఉండేదని, దాన్ని కూల్చిన ముస్లిం పాలకులు

అక్కడే  సమాధి ( మసీదు ) కట్టారని మండిపడ్డారు. ఆగ్రా చారిత్రక కట్టడం తాజ్ మహల్ త్వరలో యోగి పరిపాలనలో రామ్ మహల్ గా పేరు మార్చనున్నట్లు ఉత్తర ప్రదేశ్ బల్లియా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తెలిపారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తాజ్‌మహల్‌ పేరును త్వరలో రామ్‌మహల్‌గా లేదా కృష్ణమహల్‌గా మార్చుతుందని సంచలన

వ్యాఖ్యలు చేశారు. 
యోగి ఆదిత్యనాధ్ ఏ విషయం లోనూ వెనుకడుగు వేసే ప్రసక్తి ఉండదని, అయన ఒక సారి నిర్ణయిస్తే. . అది పూర్తి చేసే తీరతారన్నారు. 

ఈ సంచలన ప్రకటనలతో ఒక్కసారిగా ప్రకంపనలు రేకెత్తుతున్నాయి. శివాజీ వారసుడిగా ముఖ్యమంత్రిని ప్రశంసించిన సింగ్, ఆగ్రా చారిత్రక కట్టడం తాజ్ మహల్ త్వరలో యోగి పరిపాలనలో

రామ్ మహల్ గా పేరు మార్చబడుతుందన్నారు. 

తాజ్ మహల్ ఒక శివాలయం అని, అయితే ముస్లిం ఆక్రమణదారులు దానిని నాశనం చేసి, తాజ్ మహల్ గా మారి భారత సంస్కృతిని నాశనం చేశారని పేర్కొన్నారు. 

తాజ్ మహల్ ఒక శివాలయం. ముస్లిం ఆక్రమణదారులు భారతీయ సంస్కృతిని నాశనం చేయటానికి వారు ఏమైనా ప్రయత్నం చేశారు. ఒక సువర్ణావకాశం

వచ్చింది, శివాజీ వారసులు ఉత్తరప్రదేశ్ భూమికి వచ్చారన్నారు. 

సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను శివాజీ వారసుడితో పోల్చుతూ.. సమర్ గురువు రామ్‌దాస్ శివాజీని భారతదేశానికి ఇచ్చినట్లుగానే, గోరఖ్‌ నాథ్‌ బాబా యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తరప్రదేశ్‌కు ఇచ్చారని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యల పట్ల, యోగి

ఆదిత్యనాధ్, బీజేపీ కేంద్ర అధిష్టానం, ప్రజా స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 5, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam