DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మీ రొడ్డ బ్యాచ్ మాకొద్దు, బీజేపీ నేతలపై మండిపడ్డ ఎంపీ అభ్యర్థి 

*విశాఖ బీజేపీ నేతలకు ఘోర అవమానం, బీజేపీలో పుట్టిన ముసలం* 

*(DNS OFF The Record: Ganesh Reddy BVS, Visakhapatnam)*

విశాఖపట్నం, ఏప్రిల్  02, 2024 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాలో ఉమ్మడి అభ్యర్థిగా లోక్ సభ బరి లో ఉన్న ఓ అభ్యర్థి నోటి దురుసు తనానికి విశాఖ బీజేపీ లో ముసలం పుట్టినట్టుగా తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ-బీజేపీ కూటమి

అభ్యర్థులు ఎమ్మెల్యే, లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రచారం కూడా ఊపందుకుంది. 

ఒక ఉమ్మడి అభ్యర్థికి ప్రచార సహకారం చేసేందుకు విశాఖ కు చెందిన బీజేపీ నాయకులూ కొంతమంది ఆ అభ్యర్థిని కలిశారు. కేవలం ఆర్థిక బలంతో మాత్రమే గెలవగలను అనే భావన లో ఉన్న ఆ అభ్యర్థి వీళ్ళని చాల చులకనగా మాట్లాడుతూ ఈ విశాఖ రొడ్డ బ్యాచ్

మాకు అవసరం లేదు, వెళ్ళచ్చు అని హేళన చేసినట్టు తెలుస్తోంది. వెళ్లిన వారిలో యువకులు, మహిళలు, వయోవృద్ధులు కూడా ఉన్నారు. దాంతో బీజేపీ అగ్ర నేతల దృష్టికి ఈ ఘటన తీసుకు వెళ్లే ప్రయత్నం చేసిన. .. వెళ్లడం మీ తప్పు అనే విధంగా సమాధానం రావడం గమనార్హం. 

గత 40 ఏళ్లుగా పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్న తమ పట్ల ఈ విధంగా

దురుసు వైఖరి చూపించడం ఆవేదన చెందుతూ తమ సహచరుల వద్ద ఆవేదన వెళ్ళకక్కడం బాధాకరం. ఈ పొత్తుల వల్ల తమకు ఒరిగిందేమి లేదని, పైగా అవమానాలు, ఛీత్కారాలు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. దీంతో ఆత్మాభిమానం చంపుకోలేక, పార్టీ ఆదేశం ధిక్కరించలేక ఇళ్లకే పరిమితం అయ్యేందుకు సిద్ధపడ్డారు.  

పొత్తులు లేకుండా పార్టీ

అభ్యర్థులను సొంతంగా నిలబెట్టి ఉంటె. . గౌరవ ప్రదమైన ఓటింగ్ వచ్చి ఉండేదని తెలియచేస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 30, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam