DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టీడీపీ-బీజేపీ వర్గం ఏపీ లో బీజేపీని హైజాక్ చేసిందా?: నైరాశ్యంలో క్యాడర్

*జండా మోసేది బీజేపీ-ఆరెస్సెస్ వర్గం, టికెట్లు ఇచ్చింది టీడీపీ-బీజేపీకె* 

*(DNS OFF The Record: Ganesh Reddy BVS, Vizag)*

విశాఖపట్నం, ఏప్రిల్  04, 2024 (డిఎన్ఎస్):* ఈ టీడీపీ వర్గం  ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ పార్టీని పూర్తిగా హైజాక్ చేసిందని సాంప్రదాయ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ బీజేపీ లో పుట్టిన ముసలం నేడు ఎన్నికల

సందర్భంగా బహిరంగం అయ్యింది. టీడీపీ నుంచి వచ్చిన నేతలు టీడీపీ- బీజేపీ గాను ఒక వర్గం, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నికార్సైన కార్యకర్తలు అంతా ఆర్ఎస్ఎస్-బీజేపీ గానూ విడిపోయారు. ఇదే విషయం బీజేపీ లోని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు కు చెందిన అంబికా కృష్ణ, విశాఖ  కు చెందిన సీనియర్ నాయకులూ టీడీపీ- బీజేపీ

మొత్తం పార్టీని హైజాక్ చేసిందని మండిపడుతున్నారు. 
ఈ టీడీపీ వర్గం ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ పార్టీని పూర్తిగా హైజాక్ చేసిందని, దీనికి నిదర్శనమే హిందూపురం లో స్వామి పరిపూర్ణానందకు, ఏలూరు లో తపన కు, విశాఖ లో జివిఎల్ నరసింహారావు తదితరులకు ఎన్నికల్లో టికెట్ రాకుండా అడ్డుకుందని మండిపడుతున్నారు. పైగా ఒకే సామాజిక

వర్గం తో అనుబంధం ఉన్నవారికే టికెట్లు వచ్చేలా కుట్రలు పన్నారంటూ ఆర్ ఎస్ ఎస్- బీజేపీ వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ పట్ల జరుగుతున్న కుట్రలను కేంద్ర అధిష్టానం వరకూ చేరకుండా అడ్డుకోవడం వల్లనే ఈ అభ్యర్థులకు టికెట్లు వచ్చాయన్నారు. 

వీళ్ళలో ఎంతమంది బీజేపీ జండాలు మోశారు?

ఎంతమందికి పార్టీ సిద్ధాంతాలు తెలుసు? పార్టీ లక్ష్యం తెలుసు.. అసలు వీళ్ళ పేర్లు ఎంతమంది కార్యకర్తలకు తెలుసు అని ప్రశ్నిస్తున్నారు. 

జనసంఘ్ నుంచి నేటి వరకూ పార్టీ కోసం పనిచేస్తూ. .జండాలు మోస్తూ, జైళ్లకు వెళ్లిన నాయకులూ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేటప్పుడు ఎందుకు కాపాడలేడు అని

ప్రశ్నిస్తున్నారు. 

కేసులకు భయపడి పార్టీలోకి వచ్చిన వాళ్లకి నేరుగా టికెట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలపడం ఎంతవరకూ సబబు అని కేంద్ర అధిష్టానాన్ని నిఖార్సైన క్యాడర్ ప్రశ్నిస్తున్నారు?

గతంలో బీజేపీ కి చట్ట సభల్లో స్థానం లేకున్నా..క్యాడర్ లో మంచి గౌరవం ఉందని, నేడు ఎన్నికల్లో పోటీల్లో పడే నేతలు

ఉన్నారు కానీ క్యాడర్ లో పార్టీకి తగిన గౌరవం భావం లేకుండా పోయింది అన్నది వాస్తవం.  

పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఎదిరించిన సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవు. అయితే నేడు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ప్రతి చోట తప్పు పడుతూ నిరసన గళం వినిపిస్తున్నారు. 

కారణం ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన వారు

టీడీపీ-బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థులే తప్ప,  క్యాడర్ మెచ్చిన నాయకులూ కాదు అన్నది నిజం.  

విశాఖ లో జివిఎల్ నరసింహారావు కోసం ప్రెస్ మీట్ పెట్టడం, అనకాపల్లి లో అభ్యర్థి క్యాడర్ ను కలుపుకుంటూ వెళ్ళకపోవడం, హిందూపురం లో స్వామి పరిపూర్ణానంద కి టికెట్ ఇస్తే ముస్లిం ఓట్లు పడవు అనే ప్రచారం  వంటివి బీజేపీ క్యాడర్

లో వ్యతిరేకత నెలకొంది.

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 30, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam