DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న జీయర్ స్వామిచే రాజమండ్రి లో రామానుజుల విగ్రహావిష్కరణ

*మానవాళికి లభించిన మహత్తర ఔషధమే రామానుజూలు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 05, 2024 : (డి ఎన్ ఎస్):* సమతా వాదంతో మానవాళికి మహత్తరమైన సందేశం తో కూడిన ఔషధాన్ని అందించిన మహనీయులు భగవద్రామానుజూలు అని త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలిపారు. రాజమండ్రీ నగరంలోని గోదావరి గట్టున గౌతమీ ఘాట్

రంగథామం దేవాలయం వద్ద చినజీయర్ స్వామి రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. తన జీవితం ద్వారా రామానుజాచార్యులు మానవాళికి ఎన్నో సందేశాలు అందించారని, ఆయన జీవితం మానవులకు దివ్య సందేశం వంటిదని అన్నారు. సమాజంలోని అందరికి ఆలయ దర్శనం లభించాలి అని స్వయంగా వెయ్యేళ్ళ క్రితమే ఆలయ ప్రవేశం చేయించిన మహనీయులు

రామానుజాచార్యులేనన్నారు.  

భక్తి ఉద్యమం లో భాగాంగా విశిష్టాద్వైతం ద్వారా మానవాళికి అద్వితీయమైన భక్తి తత్వాన్ని అందించిన వారు రామానుజులు. అయన  ఆవిర్భవించి వెయ్యేళ్ళు పూర్తి అయినా సందర్బంగా వివిధ ప్రాంతాల్లో రామానుజుల విగ్రహాలను ప్రతిష్ట చేయడం జరుగుతోంది. చిన్న జీయర్ స్వామి ఆశ్రమం దివ్య సాకేతం

ఆవరణలో 216 అడుగుల భారీ రామానుజుల విగ్రహాన్ని, 108 దివ్య దేశాల ఆలయ నమూనాలను ఏర్పాటు చేసారు. వీటిని భారత ప్రధాని నరేంద్ర మోడీ, నాటి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ లు ప్రారంభించారు. అదే విధంగా  విజయవాడ సమీపంలోని విజయ కీలాద్రి పై కూడా విగ్రహ ఏర్పాటు జరిగింది. 

కర్తవ్య దీక్షలో ప్రదర్శించాల్సిన ధైర్యానికి,

దేవునిపై చూపాల్సిన అనన్య సామాన్యమైన నమ్మకానికి, సాటిలేని భక్తికి రామానుజాచార్యులు జీవితం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చునని అన్నారు. 

ఈ కార్యక్రమానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 30, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam