DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జ్ఞాన నేత్రాలతో వారిజ విద్యార్థులు విశ్వ విజేతలుగా నిలిచారు.

విశాఖ నుంచి విశ్వాంతరాళాలకు వారిజ విద్యార్థులు క్రీడా కీర్తి .

అంతర్జాతీయ అథ్లెటిక్స్ లో వారిజ విద్యార్థులకు 14 à°ªà°¤à°•à°¾à°²à± 

విశాఖపట్నం, ఏప్రిల్ 23, 2019 (DNS online)

: విశాఖ నగరానికి చెందిన వారిజ నేత్ర విద్యాలయ విద్యార్థులు తమ క్రీడా పటిమతో విశ్వాంతరాళాలను ప్రజ్వలింప చేశారు. జ్ఞాన నేత్రాలతో ప్రపంచ దృష్టిని పూర్తిగా తమ

వైపు త్రిప్పుకున్నారు. నేడు ఇదే పాఠశాల బాలబాలికలు అంతర్జాతీయ పారా క్రీడా పోటీల్లో పాల్గొని ఏకంగా 14 పతకాలను సాధించారు. ఈ మేరకు మంగళవారం విశాఖ నగరం లోని

విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో  à°µà°¿à°•à°¾à°¸ తరంగిణి నగర అధ్యక్షులు రాజు à°ˆ విజేతల విజయాన్ని వివరించారు. à°ˆ సమావేశంలో వారిజ నేత్ర విద్యాలయ

పాఠశాల నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

ఆసియన్ ట్రాక్ అండ్ టర్ఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యవంలో శ్రీలంక కొలంబో లో ఈ నెల 16 , 17 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ పారా

గేమ్స్ 2019 లో వారిజ బాల బాలికలు మొత్తం 14 పతకాలు పొందగా, వాటిల్లో 9  à°¬à°‚గారు పతకాలు, 4  à°°à°œà°¤ పతకాలు, 1  à°•à°¾à°‚స్య పతకం సాధించారు. 

ఈ పోటీల్లో నేత్ర దృష్ఠి విభాగం లో మూడు

విభాగాలు ఉంటాయని, వాటిల్లో మొదటి విభాగం బి 1 : పూర్తి అంధత్వం, రెండవ విభాగం బి  2 : పాక్షిక అంధత్వం, మూడవ విభాగం లో బి  3 : మరింత మెరుగు దృష్ఠి ఉన్న వారిని విభజించి

పోటీలు నిర్వహించారు. .

విజేతలు వీరే :  . ,

బి 1  à°µà°¿à°­à°¾à°—à°‚ లో  : 1 ) à°“ . జగన్  - 2 బంగారు పతకాలు ( 200 మీటర్ల పరుగు, షాట్ ఫుట్ ) సాధించగా,  
2 ) జి. నాగరాజు  -  1 బంగారు పతాకం  (

డిస్క్ త్రో ), 1 రజత పతాకం ( 100 మీటర్ల పరుగు), 
3 ) à°Ÿà°¿. కృష్ణవేణి  -  1  à°¬à°‚గారు పతాకం  ( 100 మీటర్ల పరుగు ), 1 రజత పతాకం ( 200 మీటర్ల పరుగు ) లు గెలుపు సాధించగా,  

బి 2  à°µà°¿à°­à°¾à°—à°‚ లో  :. కె.

లలిత   1 బంగారు పతాకం  ( 100 మీటర్ల పరుగు ), 1 రజత పతాకం ( 200 మీటర్ల పరుగు) క్రీడా పటిమ చూపింది. .

బి 3  à°µà°¿à°­à°¾à°—à°‚ లో : 1 ) ఏ. వంశీ  -  1 బంగారు పతాకం  ( 100 మీటర్ల పరుగు ), 1 రజత పతాకం ( లాంగ్

జంప్ ) , 
2 ) à°Žà°‚. సత్యవతి  - 2 బంగారు పతకాలు  ( షాట్ ఫుట్ ,  à°¡à°¿à°¸à±à°•à± త్రో  ) , 
3 ) బి. సీతాలక్ష్మి  - 1 బంగారు పతకం  ( 100 మీటర్ల పరుగు ), 1 కాంస్యం పతకం ( 200 మీటర్ల పరుగు ) లు విజేతలుగా

నిలిచారు.  
.

వారిజ నేత్ర విద్యాలయం : .

నేత్ర దృష్ఠి లోపం ఉన్న వారు జ్ఞాన నేత్రాలతో ప్రపంచాన్ని శాసించగలరు అనే సంకల్పంతో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త,

ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు, చిన్న జీయరు స్వామి చే ఒక దశాబ్దం క్రితం నాటిన విత్తనం నేడు ఇంతింతై వటుడింతై అన్న రీతిలో తమ ఖ్యాతి ని ప్రపంచదేశాలకు

చాటుతున్నారు. ప్రశాంత విశాఖ సాగర తీరంలో ఉన్న ఈ జీయర్ నేత్ర విద్యాలయ విద్యార్థులు సామాన్య విద్యను అత్యాధునిక సాంకేతిక విజ్ఞాన సహకారంతో సునాయాసంగా

నేర్చుకుంటూ అసామాన్య రీతిలో తమ విజ్ఞానాన్ని ప్రపంచం ముందు ప్రదర్శిస్తూ స్వామిజి మంగళశాసనములు సంపూర్ణాంగా అందుకుంటున్నారు. ఒక ప్రక్క విద్య తో పాటు, ఆటలు,

పాటల్లోనూ తమ ప్రజ్ఞా పాటవాలను చాటుతున్నారు. గతంలో పరమేష్ తన సుస్వర గానం ప్రముఖ టెలివిజన్ ఛానెల్ నిర్వహించిన పాటల పోటీలో ప్రధమ స్థానం లో నిలిచి మూడు లక్షల

నగదు పురస్కారాన్ని గెలుచుకోవడంతో ఈ పాఠశాల తన విజయ ప్రస్థానాన్ని ఆరంభించింది. గతంలో ఈ పాఠశాల విజయనగరం లో ఉండేది, ప్రత్యేక నిర్వహణకై ఈ విద్యాలయాన్ని

విశాఖలోని వారిజ కు తరలించడం జరిగింది. నాలుగేళ్ళ క్రితం సంభవించిన హుధుద్ తుఫాన్ బీభత్సం లో సైతం వీరు మొక్కవోని ధైర్యాన్ని చాటారు. .

జీయర్ స్వామిచే

మంగళాశాసనం : .

జ్ఞాన నేత్రులు సాధించిన ఘన విజయానికి అపారమైన ఆనందంతో ప్రత్యక్షంగా వీరికి మంగళాశాసనం అందించేందుకు సంస్థ వ్యవస్థాపకులు త్రిదండి చిన్న

జీయర్ స్వామి ఈనెల 27 న స్వయంగా విశాఖ నగరానికి రానున్నారు. నగరంలోని సిరిపురం లో గల ఉడా చిల్డ్రన్ ఎరీనా ( ఉడా చిల్డ్రన్ ధియేటర్) లో వికాస తరంగిణి - విశాఖ శాఖా, వారిజ

ఆశ్రమ కమిటీ ఆధ్వర్యవం లో ఈనెల 27 న సాయంత్రం 6 గంటలకు జరుగనున్న వీరి విజయ వేడుకలకు స్వామిజి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ సభలో వీరందరికి అభినందనలు

తెలియచేయనున్నారు. à°ˆ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె. భాస్కర్ సైతం హాజరు కానున్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #chinna jeeyar  #swamiji  #varija #blind school  #games  #para games  #asian games  #2019  #colombo  #gold  #silver  #bronze 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 26, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam