DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైతు హలం కదిలింది. మోడీ పై పోటీకి 100 మంది సై 

నిన్న నిజామాబాద్, నేడు వారణాసి, ఇదే రైతుల టార్గెట్.

నిన్న కవితకు, నేడు మోడీ చుక్కలు చూపించనున్న అన్నదాతలు 

అన్నపూర్ణ సాక్షిగా అన్నదాతల అద్భుత

ఆగ్రహానికి ఆరంభం. 

హైద్రాబాద్, ఏప్రిల్ 23, 2019 (DNS online) : ప్రపంచ దేశాలతో వేనోళ్ళ కొనియాడబడుతున్న  à°­à°¾à°°à°¤ దేశ ప్రధాని నరేంద్ర మోడీ à°•à°¿ తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల  à°ªà°¸à±à°ªà±

రైతులు చుక్కలు చూపించనున్నారు. వారణాసి లో మోడీ పై పోటీగా సుమారు 100 మంది పసుపు రైతులు ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అన్నదాతల ఆగ్రహం పెల్లుబికి చేసిన ప్రతీకార

చర్య ప్రభుత్వ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. పసుపు ఉత్పత్తి రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలి అంటూ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా ఎంపీ, కేంద్ర, రాష్ట్ర

ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో ప్రత్యక్ష పోరాటానికి దిగారు. అయినా లాభం లేకపోవడంతో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైపోయారు.

వారణాసి లో ఎన్నికలు చివరి దశలో జరుగనున్నాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఈనెల 29 వరకూ ఉంది. ఈలోగా వీరందరూ మోడీ కి వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలిచి

రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పనున్నారు. దరఖాస్తు దారుల్లో మోడీ పేరుకు దగ్గర à°—à°¾ ఉండే వారిని ఎంచుకున్నట్టు కూడా తెలుస్తోంది. 

నిన్న కవిత. . నేడు మోడీ

:

తమ పంటకు కనీస మద్దతు ధర వచ్చేలా చేయమని స్థానిక ఎంపీ కవితను, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోక పోవడం తో

చట్టపరమైన తిరుగుబాటు కు శ్రీకారం చుట్టారు. దీనికి టార్గెట్ à°—à°¾ నిజామాబాద్ ఎంపీ కవితను ఎంచుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా సుమారు  184 మంది రైతులు లోక్ సభ

స్థానానికి నామినేషన్లు వేసేసారు. దీంతో ఇటు కవితకు, టీఆరెస్ ప్రభుత్వానికి, ఎన్నికల నిర్వాహకులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఈవీఎం ల ద్వారా 184 మంది ని ఎలా

అమర్చాలి తెలియక ఎన్నికల కమిషన్ తల పట్టుకుంది. నయనా, భయానా వీరిని పోటీ నుంచి తప్పుకునేలా చేసేందుకు పార్టీలు చెయ్యని పని లేదు, అయినా రైతులు ధైర్యంగా

పోరాటాన్ని సాగించారు. వీళ్ళ పనితో ఎన్నికల కమిషన్, సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. 

నిజామాబాద్ రైతులే స్ఫూర్తి :

కవితకు పోటీగా సుమారు184  à°®à°‚ది రైతులు

ఎన్నికల్లో పోటీచేయడం దేశవ్యాప్తంగా రైతుల్లో ఉత్తేజాన్ని కల్గించింది. వీళ్ళ స్ఫూర్తిగానే నేడు నరేంద్ర మోడీ à°•à°¿ వ్యతిరేకంగా తెలంగాణ నుంచి  50 మంది , తమిళనాడు

నుంచి మరో 50 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 
ఇప్పుడు ఇదే పోరాటాన్ని సాక్షాతూ దేశ ప్రధానమంత్రికి చూపించనున్నారు. సుమారు 100 మంది పసుపు రైతులు ప్రధాని

నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి లోక్ సభ స్థానం నుంచి నామినేషన్లు వేయనున్నారు. కాశీ అన్నపూర్ణ సాక్షిగా తాడో పేడో తేల్చుకోడానికి వీళ్ళు వారణాసి బయలు

దేరినట్టు తెలుస్తోంది. సాయుధ పోరాటం, బహిరంగ పోరాటం, నిరసనలు, ధర్నాలను కనీసం పట్టించుకోకపోవడం వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు. అయినా వీళ్ళ

గోడు వినే నాధుడు లేకపోవడం తో వీళ్ళను చట్టపరంగానే ఎదుర్కోవాలని రైతుల్లో వచ్చిన చైతన్యం దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉద్యమ పోరాటంగా మారనుంది. వీళ్ళ

స్ఫూర్తిగానే త్వరలో తెలంగాణ లో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో ఒక్కో గ్రామ , ఎంపిటిసి, జెడ్ ఫై టిసి స్థానం నుంచి కనీసం 1500 మందికి తక్కువ కాకుండా నిరుద్యోగులు

నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే స్ఫూర్తి దేశ వ్యాప్తంగా వస్తే డొంక తిరుగుడు రాజకీయ పార్టీలకు చెల్లు చీటీయే గతి.  

 

#dns  #dnsnews  #dns news  #dns media  #dnsmedia  #dnslive  #dns live  #vizag 

#visakhapatnam  #andhra pradesh  #telangana  #varanasi  #KCR  #Kavitha  #Narendra Modi  #elections  #farmers  #nominations  #Election commission  #tamil nadu
 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 27, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam