DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ కలెక్టర్ వైఖరి పై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం :వైకాపా

టిడిపి à°•à°¿ అనుకూలమనే అనుమానాలున్నాయి. : దాడి 

కలెక్టర్ భాస్కర్ పై వైకాపా నేతలు మండిపాటు 

డ్యూటీ వేసింది 10 న, ఓటు కు గడువు 7 ట ?

విశాఖపట్నం, ఏప్రిల్ 22, 2019

(DNS online) : విశాఖపట్నం జిల్లాలో ఎన్నికల నిర్వహణను జిల్లా కలెక్టర్ భాస్కర్ తప్పుదారి పట్టించారని, దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్

కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు సారధ్యంలోని బృందం గురువారం కలెక్టర్ ను కలిసి జరిగిన తప్పిదాలను చూపించి,

సరిదిద్దుకోవాల్సిందిగా సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల పంపిణీ విధానాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించి, సొంతంగా నిబంధనలు అమలుచేశారన్నారు. ప్రధానంగా ఎన్నికల

విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది కి కూడా తమ ఓటు వినియోగించుకునే హక్కు ఉంటుందని, వీరికోసమే అమలు చేస్తున్న విధానం పోస్టల్ బ్యాలెట్ అన్నారు. దీన్ని ఎన్నికల

ముందు రోజు వరకూ అందించవచ్చన్నారు. సిబ్బంది ఒక దరఖాస్తు నింపి ఇస్తే దాని ఆధారంగా వారికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుందని, దీన్ని ముందు రోజు వరకూ 4

వేలమందికి పైగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించు కోలేకపోయారన్నారు. 

గడువు దాటాక డ్యూటీ వేసి . . .

జిల్లాలో ఆశా వర్కర్లకు ఎన్నికల ఒక్క రోజు

ముందు (ఏప్రిల్ 10 న ) ఎన్నికల విధులు కేటాయించారని, వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉందన్నారు. అయితే విశాఖ జిల్లాలో పోస్టల్

బ్యాలెట్ కి గడువు ఏప్రిల్ 7 నే ( అప్పడికే మూడు రోజులు ముందుగానే ) ముగిసి పోయిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ గడువు ముగిసి పోయిన తర్వాత ఎన్నికల విధులు కేటాయించడం

జిల్లా కలెక్టర్ తప్పిదమేనన్నారు. జిల్లాలో ఎన్నికల్లో జరిగే ప్రతి తప్పుకు కలెక్టర్ భాద్యుడు అన్నారు. ఆశ వర్కర్లకు ముందుగా విధులు కేటాయించినట్టయితే వారికీ

కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాల్సియుందన్నారు. ఒక్క రోజు ముందు విధులు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. నిబంధనలు అడుగడుగునా తుంగలోకి తొక్కినట్టే కనపడుతోందని

అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మండి పడ్డారు. 

వారం రోజుల ముందు పోస్టల్ బ్యాలెట్ లు ఇవ్వ వచ్చు. ఎన్నిక ముందు రోజు వరకూ  à°…ధికారి అనుమతి తో

పోస్టల్ బ్యాలెట్ ఇవ్వవచ్చు అని నిబంధనలు తెలియచేస్తున్నాయని వివరించారు. అయితే విశాఖ జిల్లాలో ఈనెల  7 à°µ తేదీ వరకే అనుమతించడమే తప్పు అన్నారు.  à°…ంటే ఎన్నికకు

నాలుగు రోజుల ముందుగానే (ఎన్నిక తేదీ ఏప్రిల్ 11 ) తర్వాత దరఖాస్తు ఇవ్వవద్దు, పోస్టల్ బ్యాలెట్ ఇవ్వవద్దు అని రూలు పెట్టి నియంతలా వ్యవహరించారన్నారు. గాజువాక లో

పోస్టల్ బ్యాలెట్ బాక్స్ పెట్టలేదని, దీంతో ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారన్నారు. వైకాపా కు మీరు అనుకూలంగా పనిచెయ్యనవసరం లేదని, ఉద్యోగుల ఓటింగ్ హక్కును

హరిస్తున్నారన్న అనుమానాలున్నాయన్నారు. తక్షణం ఎన్నికల కమిషన్ తో చర్చించి, పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకొని వారికీ మరొక అవకాశం కల్పించమని సూచించినట్టు

తెలిపారు. నిబంధనల ప్రకారమే దీన్ని సవరించుకోవాల్సిందిగా సూచించామన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో ఒక విధంగా ఎన్నికలు జరిగితే విశాఖ జిల్లాలో

మాత్రం నియంత ల నియంత్రించినట్టు అనుమానాలున్నాయన్నారు. తమకు ఇవే మొదటి ఎన్నికలు కాదని, దశాబ్దాల నుంచి తాము ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నామని, తమకి కూడా

ఎన్నికల నిబంధనలు తెలుసునన్నారు. 
జిల్లాలో జరిగిన అంశాలపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కలెక్టర్ ను కలిసిన వారిలో

ద్రోణంరాజు శ్రీనివాస్ ( విశాఖ దక్షిణ అభ్యర్థి), à°Žà°‚. శ్రీనివాసరావు (భీమిలి అభ్యర్థి), డాక్టర్ సత్యవతి  (అనకాపల్లి ఎంపీ అభ్యర్థి), తిప్పల నాగిరెడ్డి (గాజువాక

అభ్యర్థి), అదీప్ రాజు (పెందుర్తి అభ్యర్థి) తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #dnsonline  #dns online  #YSR Congress  #telugudesam #collector  #bhaskar  #elections  #postal ballet  #election commission  #visakhapatnam  #vizag

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 27, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam