DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందువులను దూషించిన వారికి ఇచ్చిన టికెట్ రద్దు చెయ్యాలి: 

*అభ్యర్థినే కాదు, పార్టీని కూడా ఓడిస్తాం: హిందూ సంఘాలు ప్రకటన*  

*(DNS Report: Ganesh Reddy BVS, Staff Reporter)*
 
విశాఖపట్నం, ఫిబ్రవరి 27, 2024 (డిఎన్ఎస్):* గత కొన్నేళ్లుగా హిందువులను, ప్రధానంగా బ్రాహ్మణులను దూషిస్తూ నోటికి వచ్చిన ప్రేలాపనలు చేసిన అభ్యర్థులనే కాదు, వాళ్లకి టికెట్లు ఇచ్చిన పార్టీని సైతం ఓడిస్తామని హిందూ సంఘాలు

ప్రకటించాయి. హిందువులు, బ్రాహ్మణుల యువతులను లేపుకు వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్లకి లక్ష రూపాయలు నజరానా ఇస్తామని, ప్రకటించిన ఒక హిందూ ద్వేషికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం పట్ల హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణం ఆ అభ్యర్థిని విరమించుకోవాలని, లేనిపక్షంలో ఆ పార్టీని కూడా ఓడిస్తామని ప్రకటించాయి. ఈ

నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు రోడ్డెక్కి నిరసనలు, చేయడం తో పాటు, సోషల్ మీడియా లో హోరెత్తిపోతోంది. గుంటూరు, విజయవాడ, తిరుపతి, తదితర ప్రాంతాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో నిరసనలు చేశారు. 
హిందూ సంఘాల మహిళా ప్రతినిధి లక్ష్మి రామానుజాదాసి మాట్లాడుతూ తమకు ఏ రాజకీయ పార్టీ పై వ్యతిరేకలేదని, అయితే

నిలువునిపాదం హిందూ ద్వేషాన్ని నింపుకున్న వ్యక్తులకు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్లు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మండిపడ్డారు. హిందూ మహిళలు, దేవి దేవతలను, అనకూడని విధంగా దూషించిన వ్యక్తిని నెత్తినపెట్టుకున్న తెలుగుదేశం తన తప్పు తెలుసుకుని, తక్షణం ఆ వ్యక్తులను తొలగించాలని డిమాండ్ చేసారు.

లేనిపక్షంలో తాము టీడీపీ ని బహిష్కరించే దిశగా యోచన చేస్తామని హెచ్చరించారు. సాదు సంత్ లు మాట్లాడుతూ సదరు వ్యక్తి కి ఎస్సి సామాజిక రిజర్వేడ్ సీటు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఇతను హిందూ నుంచి మతం మారడం జరిగిందని, మతం మరీనా వ్యక్తి ఎస్సి కోటా నుంచి బిసి సి కోటా విభాగం లోకి వెళ్లిపాతారని తెలిపారు. దీనిపై తాము

ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 

ఒకటి రెండు సీట్ల కోసం చూసుకుంటే. .రాష్ట్ర వ్యాప్తంగా సీట్ల పై వేటు పడే అవకాశం ఉంది. దీనిపై తక్షణం తెలుగుదేశం పార్టీ మేలుకొని నిర్ణయం మార్చుకోకుంటే కోలుకోలేని దెబ్బ పడే అవకాశం ఉంది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 28, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam