DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నెల్లిమర్ల అభ్యర్థి ఫై విమర్శలు, డిపాజిట్ దక్కితే జనసేన కి జాక్ పాటే 

*సొంత ఉద్యోగులు, పార్టీ క్యాడర్ తోనే సత్సంబంధాలు  లేవని ప్రచారం* 

*(DNS Report: ఇదీ రాజకీయం, Ganesh Reddy BVS)*

విశాఖపట్నం, ఫిబ్రవరి 28, 2024 : (డి ఎన్ ఎస్):* జనసేన మొట్టమొదటి సారిగా ప్రజాటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో రెండవ పేరు నెల్లిమర్ల నుంచి లోకం మాధవి. ఏ సమీకరణాల ద్వారా ఈమె పేరు ప్రకటించారో పార్టీ క్యాడర్ కె అర్ధం కానీ

స్థితి. ఒక ఐటి రంగానికి చెందిన పారిశ్రామిక వేత్తగా ఉన్నా ఈమెకు సొంత సిబ్బంది నుంచి, పార్టీ క్యాడర్ నుంచే ఘాటైన విమర్శలు వస్తున్నాయి. 
ఈ అభ్యర్ధికి నెల్లిమర్లలో డిపాజిట్ దక్కితే జనసేన పార్టీ కి జాక్ పాటె నంటూ సొంత క్యాడర్ తెలియచేస్తున్నారు. 

వీరి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు పెద్దగానే ఉన్నా

కనీస సదుపాయాలు, సౌకర్యాలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయనే అభిప్రాయం ఉద్యోగులు తెలియచేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు నిరంతరం భయం గుప్పెట్లో విధులు నిర్వహిస్తున్నారు అనే చెప్పాలి. నిట షిఫ్ట్ సాయంత్రం 6 :30 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకూ ఉంటుంది. ఈ షిఫ్ట్ ల్లో పనిచేసి మహిళా ఉద్యోగులకు పూర్తిగా రక్షణ కరువు.

వీరికి తగిన క్యాబ్ సర్వీసెస్ కల్పించి భద్రత కల్పించవలసిన భాద్యత పాటించక పోగా కేవలం ఒక బస్సు లో మాత్రం విశాఖ ప్రధాన రహదారుల్లో దింపేస్తున్నారు. మహిళలను వారి ఇంటి దగ్గర సురక్షితంగా దింపవలసిన సంస్థ, వీరి రక్షణ పూర్తిగా గాలికి వదిలేసింది. పైగా సంస్థ ఉద్యోగుల పట్ల తీవ్ర ఒత్తిడి నెలకుంటోంది. 
ఇక ఉద్యోగం లో ఉన్న

మహిళలకు మెటర్నిటీ సెలవు పై ఘాటైన విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వేతనం లేదా సగం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాల్సి ఉండగా, ఆ విధానం అమలు లో లేదని తెలియచేస్తున్నారు. 
ఇక ఉద్యోగం నుంచి వైదొలగే వారికి రెండు నెలల గ్రెస్ సమయం అమలు చేయాల్సి ఉండగా. . అనుమతి ఇవ్వకుండా పలు కారణాల సాకుతో ఏడాదికి పైగా జాప్యం చేయడం పట్ల

ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇతర సంస్థల్లో అధిక వేతనం వచ్చినా ఈ సంస్థ నుంచి రిలీవ్ కాకపోవడంతో కొత్త ఆఫర్లు వాదులు కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇక రాజకీయ పరంగా సొంత క్యాడర్ తోనే సత్సంబంధాలు లేకపోవడం, పార్టీ నేతలతో కలిసి పనిచేసే వైఖరి లేకపోవడం తో నియోజక వర్గం లో జనసేన పార్టీలోనే

సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 
సొంత ఉద్యోగులు, బలమైన పార్టీ అండదంలు ఉన్నప్పడికి. . .వాటిని సద్వినియోగం చేసుకోవడం లో నెల్లిమర్ల అభ్యర్థి ఘోరంగా విఫలం చెందడం గమనార్హం. 

ఆ నియోజక వర్గంలో అతి పెద్ద సామాజిక వర్గం కు చెందినప్పడికి ఆ సభ్యులతో సైతం సత్సంబంధాలు లేకపోవడం పెద్ద తప్పిదం. 



నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజక వర్గం సీటును వీరికి కేటాయించడం ద్వారా జనసేన పెద్ద తప్పిదం చేసింది అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. 

ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తాం, రాష్ట్ర భవిష్యత్ మార్చేస్తాం అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగాలు కేవలం వేదికల వరకే పరిమితం

కానుంది. ఇంత వ్యతిరేకత ఉన్న అభ్యర్థులకు మొదటి విడతలో టికెట్ కేటాయించడం పెద్ద తప్పిదంగా పరిణమించనుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 27, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam