DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అనపర్తి నల్లమిల్లి చేతిలో పురంధేశ్వరి ఎంపీ ఓట్ల భవితవ్యం 

*నమ్మితే నట్టేట ముంచుతారా?  బాబు ను నిలదీసిన నల్లమిల్లి* 

*(Report:Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 28, 2024 (డి ఎన్ ఎస్):* అనపర్తి లో ఐదేళ్ల పాటు ఎన్నో కష్ఠాలు పడి నల్లమిల్లి  రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేసుకున్న ఆశల సౌధాన్ని బీజేపీ ఒక్కదెబ్బతో కూల్చేసింది. పొత్తులో భాగంగా బీజేపీ అనపర్తి ని అడగడంతో

బీజేపీ అగ్రనేతల కోసం ఈ సీటు ను త్యాగం చేసారు నల్లమిల్లి. అయితే అధికార పార్టీ కి అమ్ముడుపోయిన బీజేపీ నేతల కారణంగా ఈ సీటును డిపాజిట్ కూడా తెచుకోలేని వ్యక్తికీ  కట్టబెట్టింది బీజేపీ. రాష్ట్రంలో కచ్చితంగా గెలిచే అనపర్తి సీటు ను బీజేపీ నేతల కక్కుర్తి కారణంగా అధికార పార్టీ కి అప్పగించేస్తున్నారు. దీంతో పాటు

రాజమండ్రి ఎంపీ సీటు కూడా అడుగంటిపోవడం ఖాయంగా  కనపడుతోంది. గతంలో రాజమండ్రి ఎంపీ విజయాన్ని నిర్ణయించింది అనపర్తి ఓటర్లే. ఈ అనపర్తి పరిధిలో  రెడ్డి సామజిక వర్గమధికంగా ఉంది. అందుకే ప్రతిసారీ రెడ్డి వర్గాలే బరిలో నిలుస్తున్నాయి. అలాంటిది ఈ సారి అత్యంత బలహీనమైన వ్యక్తికీ ఇవ్వడాన్ని టీడీపీ క్యాడర్

తట్టుకోలేకపోతున్నారు. 

నల్లమిల్లి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే ఉమ్మడి అభ్యర్థి గా రాజమండ్రి లోక్ సభ బరిలో ఉన్న  పురందేశ్వరి కి ఓటమి తప్పదు అని తెలుస్తోంది.  పొత్తు లను దుర్వినియోగం చేసిన బీజేపీ కి తగిన గుణపాఠం చెప్పాలి అని టీడీపీ క్యాడర్ సిద్ధంగా ఉంది. 

చంద్ర బాబు ను నిలదీసిన

నల్లమిల్లి

విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం నల్లమిల్లి కి ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాడితే నన్ను బలిచేసారని నల్లమిల్లి తెలిపారు. అనపర్తిలో తెలుగుదేశం ఉనికిని ప్రమాదంలో పడేసింది మీరే.. ఇపుడు కాపాడుకోవలసింది మీరేనంటూ కుండబ్రద్దలు కొట్టినట్లు నల్లమిల్లి

చెప్పడం జరిగింది. 

ఈ నేపథ్యంలోనే నల్లమిల్లి వర్గం అభిమానులు బుధవారం పెద్ద సంఖ్యలో రామకృష్ణ రెడ్డి కార్యాలయానికి  చేరుకున్నారు. అర్ధ రాత్రి వరకూ జరిగిన అంతర్గత సమావేశం నిర్వహించింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చెయ్యాలని కార్యకర్తలు నల్లమిల్లి ఫై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చారు. అయితే పార్టీల నిర్ణయం కోసం

నాలుగు రోజులు వేచి చూద్దామని నల్లమిల్లి ప్రకటించారు. 

న్యాయం కోసం నల్లమిల్లి..
న్యాయం చెప్పమని కోరుతూ కుటుంబ సమేతంగా ప్రజల వద్దకు వెళ్ళనున్నట్టు నల్లమిల్లి ప్రకటించారు. వైయస్సార్ సిపి పన్నిన ఉచ్చులో చిక్కుకుని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నాకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి ప్రజల నిర్ణయం ప్రకారం

భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మహేంద్రవాడలో ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. నియోజకవర్గం లోని అభిమానులు మహేంద్రవాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని మద్దతు తెలియజేయవలసిందిగా పిలుపునిచ్చారు. 

ఈ ప్రాంతం లో అత్యంత ప్రజాదరణ కల్గిన నల్లమిల్లి స్వతంత్ర

అభ్యర్థిగా బరిలో నిలిస్తే ఫలితాలు తారుమారు అట్టే అవకాశం ఉంది. నేతల కాసులు కక్కుర్తి కోసమో, పదవి దాహం తో ఈ పరిస్థితిని బీజేపీ తెచ్చుకుంది. 
ప్రస్తుతం ఉన్న అనపర్తి అభ్యర్థిని  మార్చి బలమైన నేతని నిలిపితే నల్లమిల్లి వర్గం పనిచేసేందుకు  సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. లేని పక్షంలో నల్లమిల్లి స్వతంత్ర

అభ్యర్థిగా బరిలో ఉంటారు. అనపర్తి తో ని తనఖాతాలో వేసుకోవడమే కాకా, రాజమండ్రి ఎంపీ సీటు కూడా గోవిందా అనడం తరువాయి. 

ఒక మంచి సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటె బీజేపీ లో ఒక నేత అధికార పార్టీతో కుమ్మక్కు అవ్వడం వల్ల మొత్తం పొత్తులోని బిక్  పొత్తులోని అభ్యర్థులు అందరు ఓటమి ఫలితం పొందే అవకాశం ఉంది. రాష్ట్ర  వ్యాప్తంగా

నియోజ వర్గాలతో సంబంధం లేని వ్యక్తులకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. అక్కడ క్యాడర్ ను పరిచయం చేసొవడానికే నెలరోజులు పడుతుంది. ఈలోగా ఎన్నికలు ముగిసి పోతాయి. జరగవలసిన  డామేజ్ జరిగిపోతుంది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 28, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam